రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (24) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు మ్యాక్స్వెల్ ప్రయత్నించాడు. అయితే అది సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో ఫీల్డర్ వైపు బంతి వెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఓబెడ్ మెకాయ్ ముందుకు దూకుతూ చక్కని క్యాచ్ అందుకున్నాడు. మ్యాక్స్వెల్ నిరాశగా మైదానం వీడాడు.