రెండో క్వాలిఫైయర్‌లో బెంగళూరు జట్టు ఇబ్బందులు పడుతోంది. రెండో ఓవర్లోనే కోహ్లీ (7) అవుటవగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ (25) కూడా పెవిలియన్ చేరాడు. ఓబెడ్ మెయాక్ వేసిన 11వ ఓవర్లో ఆఫ్‌సైడ్ వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ గాల్లోకి ఎగిరి మరీ చూడచక్కని క్యాచ్ అందుకోవడంతో డుప్లెసిస్ మైదానం వీడాడు.