బెంగ తీరేనా..

ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ప్రతీసారి ‘ఈ సాల కప్ నమదే’(ఈ సంవత్సరం కప్పు మనదే) అంటూ సందడి చేసే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్, సమర్థవంతమైన స్పిన్ వనరులు ఉన్నా.. పేస్ విభాగంలో సరైన ప్రత్యామ్నాయాలు లేక ఇప్పటి వరకు కప్పును ముద్దాడలేకపోయిన బెంగళూరు.. తాజా వేలంలో కొనుగోలు చేసుకున్న మ్యాక్స్‌వెల్, కైల్ జెమీసన్పై గంపెడు ఆశలు పెట్టుకుంది. గతేడాది పంజాబ్‌కు భారంగా మారిన మాక్సీ..విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో కలిసి బెంగళూరు రాత మార్చుతాడేమో చూడాలి!
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, దేవదత్ పడిక్కల్, మ్యాక్స్‌వెల్, ఫిన్ అలెన్, మహమ్మద్ అజహరుద్దీన్, వాషింగ్టన్ సుంద ర్ ఇలా పేపర్ పై చూస్తే శత్రుదుర్భేద్యంగా కనిపించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బరిలో దిగాక ఆ స్థాయిలో సత్తాచాటడంలో ప్రతీసారి విఫలమవుతున్నది. కోచ్‌లు మారినా, కీలక ఆటగాళ్లు మారినా.. ఐపీఎల్ మొత్తంలో ఇప్పటి వరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ మాత్రం జట్టుకు తొలి టైటిల్ అందించలేకపోయాడు.
బ్యాటింగ్‌లో విజృంభించి భారీ స్కోర్లు చేసినా.. దాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం కావడం.. లేక కొన్నిసార్లు టాపార్డర్ విఫలం కావడంతో జట్టు మొత్తం తక్కువ పరుగులకే చాప చుట్టేయడం ఇలా బెంగళూరుకు తొలి టైటిల్ కలగానే మిగిలింది. ఫించ్, మొయిన్ అలీ సహా పదిమంది ఆటగాళ్లను వదిలేసుకున్న బెంగళూరు తాజా వేలంలో ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంది. మ్యాక్స్‌వెల్ రాకతో మిడిలార్డర్ బలం పెరుగగా.. కైల్ జెమీసన్ పేస్ బాధ్యతలు మోయనున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే చాన్స్‌లు ఉన్నాయి.
చాహల్, సుందర్, జంపా స్పిన్ భారాన్ని మోయనున్నారు. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ముంబైతో బెంగళూరు తలపడనుంది. మరి పదమూడు సీజన్లుగా సాధ్యం కానిది ఈ సారి సాకారమవుతుందో చూడాలి!
బలాలు
- ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండటం.
- దేవదత్ పడిక్కల్, కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, అలెన్ రూపంలో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం.
- సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 194.54 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన మహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ బేబీ, డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్లో అందుబాటులో ఉండటం.
- యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు భారత అగ్రశ్రేణి స్పిన్నర్లు జట్టులో ఉండటం.
బలహీనతలు
- పేస్ బౌలింగ్ విభాగంలో అనుభవలేమి.
- టాపార్డర్‌లో కోహ్లీ, ఏబీ విఫలమైతే..బాధ్యతలు తీసుకునే ఆటగాళ్లు లేకపోవడం.
- కోట్లు పెట్టిన కైల్ జెమీసన్‌కు భారత్‌లో ఆడిన అనుభవం లేకపోవడం.
- ఇటీవలి కాలంలో సిరాజ్, నవ్‌దీప్ సైనీ ఆకట్టుకుంటున్నా.. పరుగులు కట్టడి చేయలేకపోవడం.
భారత ఆటగాళ్లు: కోహ్లీ, పడిక్కల్, సిరాజ్, సైనీ, పవన్ దేశ్‌పాండే, షాబాజ్ అహ్మద్, సుందర్, చాహల్, హర్షల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, అజహరుద్దీన్, సుయాశ్ ప్రభుదేశాయ్, భరత్.
విదేశీ ఆటగాళ్లు: డివిలియర్స్, జంపా, కేన్ రిచర్డ్సన్, సమ్స్, మ్యాక్స్‌వెల్, కైల్ జెమీసన్, క్రిస్టియన్, అలెన్.
కొత్తగా చేరినవాళ్లు: మ్యాక్స్‌వెల్, సచిన్ బేబీ, రజత్, అజహరుద్దీన్, కైల్ జెమీసన్, క్రిస్టియన్, ప్రభుదేశాయ్, భరత్.
ఇవీ కూడా చదవండి
యువరత్న 2 డేస్ కలెక్షన్స్.. పవర్ స్టార్ పాచిక పారలేదుగా..!
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కలకలం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

