Rohit Sharma | ఐపీఎల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు ఇదే
Rohit Sharma : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rphit Sharma) ఐపీఎల్(IPL)లో మాత్రం చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 0-5 పరుగుల మధ్య ఎక్కువ సార్లు ఔటైన వాళ్లలో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ టాప్‌లో నిలిచాడు. అతని తర్వాత దినేశ్ కార్తిక్ (44) ఉన్నాడు. రాబిన్ ఊతప్ప(41), సురేశ్ రైనా(40) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
Rohit Sharma : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rphit Sharma) విధ్వంసక బ్యాటింగ్, అతని రికార్డుల గురించి అందరికి తెలిసిందే. వన్డేల్లో ఏకంగా మూడుసార్లు డబుల్ సెంచరీలు బాదడమే కాకుండా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిపాడు. అలాంటి అతను ఐపీఎల్ 2023(IPL)లో మాత్రం చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. 0-5 పరుగుల మధ్య ఎక్కువ సార్లు ఔటైన వాళ్లలో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ టాప్‌లో నిలిచాడు.
16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ 1 రన్‌కే పెవిలియన్ చేరాడు. దాంతో, సున్నా నుంచి ఐదు పరుగుల మధ్య అతను ఔట్ కావడం ఇది 50వ సారి. అతని తర్వాత దినేశ్ కార్తిక్ (44) ఉన్నాడు. రాబిన్ ఊతప్ప(41), సురేశ్ రైనా(40) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
దంచిన కోహ్లీ, డూప్లెసిస్
చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. 10 బంతుల్లో 1 పరుగు చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ (84 నాటౌట్) అర్ధ శతకం బాదడంతో ముంబై 171 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (82), ఫాఫ్ డూప్లెసిస్ (73) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పోటాపోటీగా సిక్స్‌లు, బౌండరీలు కొట్టారు. వీళ్లు మొదటి వికెట్‌కు 148 రన్స్ జోడించారు. డూప్లెసిస్ ఔటయ్యాక కోహ్లీ, మ్యాక్స్‌వెల్(12)తో కలిసి జట్టును గెలిపించాడు. అర్షద్ ఖాన్ ఓవర్లో సిక్స్ కొట్టడంతో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
IPL 2023 | గుజరాత్ టైటన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి విలియమ్సన్ ఔట్
Yuzvendra Chahal: చాహల్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 300 వికెట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

