ప్రయోగాలకు స్వస్తి
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇన్ని రోజులు మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేసిన టీమ్ఇండియా ఇక తుది కూర్పుపై నజర్ వేసింది.
- టీ20 ప్రపంచకప్ కూర్పుపై కసరత్తు
- భారత్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్ నేడు
- రాత్రి 10.30 సోనీ సిక్స్‌లో
భారత్, ఇంగ్లండ్ పొట్టి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ జట్ల మధ్య సమరం అభిమానులను అలరించనుంది. ఆటకు కొత్త ఊపు తీసుకొస్తూ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వీరబాదుడు బాదుతున్న ఇంగ్లండ్.. టీమ్ఇండియాకు మధ్య పోరు యుద్ధాన్ని తలపించే అవకాశముంది. టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ ప్రయోగాలకు స్వస్తి పలుకుతూ కూర్పుపై కసరత్తు చేసేందుకు భారత్ తహతహలాడుతున్నది. మోర్గాన్ నుంచి కెప్టెన్సీ అందుకున్నబట్లర్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లిష్ జట్టు ఇరగదీయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.
సౌతాంప్టన్: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇన్ని రోజులు మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేసిన టీమ్ఇండియా ఇక తుది కూర్పుపై నజర్ వేసింది. ఈ నేపథ్యంలో జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది..ఎవరిని బెంచ్‌కు పరిమితం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి జట్టులోకి రాగా, కోహ్లీ, బుమ్రా, జడేజా, పంత్, శ్రేయాస్ అయ్యర్ రెండో టీ20 నాటికి టీమ్‌తో కలువనున్నారు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అదరగొట్టిన దీపక్ హుడా జట్టులో ఎక్కడ చోటు కల్పించాలనే దానిపై మేనేజ్మెంట్ ఆలోచన చేస్తున్నది. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శాంసన్ ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం లభిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ మిడిలార్డర్ పటిష్ఠంగా కనిపిస్తున్నది. బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్‌తో పాటు హర్షల్ పటేల్, అవేశ్‌ఖాన్ తుది జట్టులో బెర్తు దక్కవచ్చు.
బట్లర్ సారథ్యంలో :
ఇయాన్ మోర్గాన్ నుంచి పగ్గాలు అందుకున్న డాషింగ్ బ్యాటర్ జోస్ బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ పోటీకి సై అంటున్నది. న్యూజిలాండ్‌తో పాటు భారత్‌తో చివరి టెస్టులో అదరగొట్టిన జానీ బెయిర్‌స్టోతో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. వీరిద్దరు లేకపోయినా..ఇంగ్లండ్ ఫైర్ పవర్‌కు ఢోకా లేదు.
జట్ల అంచనా
భారత్: రోహిత్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఉమ్రాన్ మాలిక్/అర్ష్‌దీప్‌సింగ్
ఇంగ్లండ్: బట్లర్(కెప్టెన్), రాయ్, మలన్, అలీ, లివింగ్‌స్టోన్, బ్రూక్, కరన్, జోర్డాన్, మిల్స్, టోప్లే, పార్కిన్సన్.
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: జూలై 7
రెండో టీ20: జూలై 9
మూడో టీ20: జూలై 10
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

