IND vs BAN | రోహిత్ ఔట్.. కోహ్లీ దూకుడు.. పవర్ ప్లేలో స్కోర్..?
IND vs BAN : సూపర్ 8 రెండో మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దంచికొడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ(23) భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు
IND vs BAN : సూపర్ 8 రెండో మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దంచికొడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ(23) భారీ షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ బాదిన హిట్‌మ్యాన్ నాలుగో బంతిని అంచనా వేయలేక జకీర్ అలీ చేతికి చిక్కాడు. దాంతో, 39 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ పడింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ(27), రిషభ్ పంత్(3)లు భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. రోహిత్ వికెట్ తర్వాత స్కోర్ వేగం తగ్గినా.. ముస్తాఫిజర్ వేసిన ఆరో ఓవర్లో కోహ్లీ కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. దాంతో, పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 53 రన్స్ కొట్టింది.
పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తుకు చేరువైన భారత జట్టు (Team India) మరో విజయంపై కన్నేసింది. అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా శనివారం అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా సారథి నజ్ముల్ హుసేన్ శాంటో బౌలింగ్ తీసుకున్నాడు. లో స్కోర్లు నమోదవుతున్న అంటిగ్వా పిచ్‌పై భారత్‌ను తక్కువకే కట్టడి చేయడమే తమ ప్రణాళిక అని శాంటో తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

