Asian Games 2023 : ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ డబుల్స్ జోడీ రోహన్ బోపన్న(Rohan Bopanna), యుకీ బాంబ్రీ(Yuki Bhambri)కి షాక్ తగిలింది. తమ కంటే తక్కువ ర్యాంక్ ప్లేయర్ల చేతిలో రెండో రౌండ్లో ఓడిపోయారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ ద్వయం సెర్గే ఫొమిన్( Sergey Fomin), ఖుమోయున్ సుల్తానోవ్(Khumoyun Sultanov) బోపన్న, బాంబ్రీపై పైచేయి సాధించారు.
మ్యాచ్ ఆఖర్లో బాంబ్రీ సర్వీస్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. దాంతో, భారత జోడీ 2-6, 6-3, 10-6 పాయింట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్(Womens Doubles)లో భారత క్రీడాకారిణులు రుతుజా భోసలే(Rutuja Bhosale), కర్మాన్ థాండీ(Karman Thandi) బోణీ కొట్టారు. 93 నిమిషాల పాటు జరిగిన తొలి రౌండ్లో గెలిచి ప్రీక్వార్టర్స్‌కు చేరారు. కజకిస్థాన్‌కు చెందిన ఝనెల్ రస్తెమోవ, అరుజాన్ సగండికోవాపై రుతుజా, కర్మాన్ 6-4, 6-2తో గెలుపొందారు.