Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Ollie Robinson : స్వదేశంలో ఇటీవల పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన ఓలీ రాబిన్సన్ (Ollie Robinson)కు ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్టు (Central Contract) దక్కింది. దేశవాళీ క్రికెట్లో మెరుస్తున్న తొమ్మిది మంది కుర్రాళ్లకు డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అప్పగించింది.
Ollie Robinson : స్వదేశంలో ఇటీవల పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన ఓలీ రాబిన్సన్ (Ollie Robinson)కు ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్టు (Central Contract) దక్కింది. పునరాగమనంలో వికెట్ల వేటతో రెచ్చిపోతున్న ఈ పొడగరి పేసర్ వార్షిక కాంట్రాక్ట్‌కు ఎంపికయ్యాడు. 2026-27 సంవత్సరానికిగానూ సోమవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు 30 మందికి జాతీయ కాంట్రాక్టులు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి తొలిసారి ఈ హోదా సొంతమైంది. అలానే దేశవాళీ క్రికెట్లో మెరుస్తున్న తొమ్మిది మంది కుర్రాళ్లకు డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అప్పగించింది.
ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. అంతర్జాతీయంగా నిలకడగా రాణిస్తున్న స్టార్ ఆటగాళ్లందరికీ కాంట్రాక్ట్ కొనసాగించింది. 2026-27 సంవత్సరానికిగా సోమవారం కెప్టెన్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌లతో పాటు 30 మందికి వార్షిక వేతనాలను ఖరారు చేసింది. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో సిరీస్‌లో పునరాగమనం చేసి 21 వికెట్లతో చెలరేగిన పొడగరి పేసర్ రాబిన్సన్ మూడేళ్ల తర్వాత కాంట్ట్రాక్ట్ దక్కించుకున్నాడు.
JUST IN: England announce their men’s central contracts for 2026-27 🏴
Uncapped seamer Henry Crocombe has been awarded a two-year contract, with 30 full deals and nine development contracts handed out by the ECB https://t.co/LQplCmizOt
— Cricinfo (@cricinfo) October 12, 2026
ఈమధ్య ఆకట్టుకున్న సామ్ కుక్, టామ్ బాంటన్, జోర్డన్ కాక్స్, హెన్రీ క్రొకొంబే, ఎమిలియో గే, మాథ్యూ ఫిషెర్, డాన్ లారెన్స్లకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ అప్పగించింది ఈసీబీ. టీ20ల్లో బంతితో అదరగొడుతున్న సోనీ బేకర్, కాక్స్, క్రొకొంబెలతో ఇంగ్లండ్ బోర్డు రెండేళ్ల ఒప్పందం చేసుకుంది. మొత్తంగా 11 మంది ఆటగాళ్లకు 2028 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కాంట్రాక్ట్ కొనసాగనుందని ఈసీబీ వెల్లడించింది.
Crocombe and Jordan Cox have both signed new two-year contracts, while six other players who did not have contracts last year – Tom Banton, Sam Cook, Emilio Gay, Matthew Fisher, Dan Lawrence and Ollie Robinson – have signed one-year deals
https://t.co/fBOREz4X82
— Cricinfo (@cricinfo) October 12, 2026
ఇంగ్లండ్ సెంట్రల్ క్రాంట్రాక్టు జాబితా 2026-27 : జో రూట్, హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, టామ్ బాంటన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బట్లర్, కార్సే, సామ్ కుక్, జోర్డన్ కాక్స్, హెన్రీ క్రొకంబే, సామ్ కరన్, లియాం డాసన్, బెన్ డకెట్, ఎమిలియో గే, మాథ్యూ ఫిషర్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఓలీ రాబిన్సన్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.
ఇంగ్లండ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ జాబితా 2026-27 : జేమీ కోల్స్, మసన్ క్రనే, జోష్ హల్, ఎడీ జాక్, బెన్ మెక్కిన్నే, లియాం ప్యాటర్సన్ వైట్, థామస్ రే, మాథ్యూ రెవిస్, మిచ్ స్టాన్లీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

