Rizwan: సెమీస్‌కి రెండ్రోజుల ముందు ఐసీయూలో పాక్ క్రికెటర్.. కోలుకొని వచ్చి మ్యాచ్ ఆడిన రిజ్వాన్

దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాని ఆ అవకాశం కొందరికే దక్కుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పాక్ క్రికెటర్ మొహమ్మదర్ రిజ్వాన్ ఎంతగానో తపన పడ్డాడు. సెమీస్ మ్యాచ్‌కి రెండ్రోజుల ముందు రిజ్వాన్ .. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రాత్రులు ఐసీయూలోనే ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు కోలుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతానని పట్టుబట్టాడట. ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించాక ఆడేందుకు అనుమతించారు.
ఆసీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ పంచుకున్న ఫొటో షేర్ చేస్తూ.. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్ కు ముందు రెండ్రోజులు రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందాడని అక్తర్ వెల్లడించారు. అతని డెడికేషన్ చూసి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రిజ్వాన్ అద్భుతంగా రాణించి 67 పరుగులు నమోదు చేశాడు. అనారోగ్యం ఛాయలేవీ కనిపించకుండా అద్భుతంగా ఆడాడు. ఆపై వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగ్గా చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఒక సంవత్సరంలో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించాడు.
Can you imagine this guy played for his country today & gave his best.
— Shoaib Akhtar (@shoaib100mph) November 11, 2021
He was in the hospital last two days.
Massive respect @iMRizwanPak .
Hero. pic.twitter.com/kdpYukcm5I
This is unreal. No wonder Matthew Hayden called him a warrior. Huge respect for Mohammad Rizwan who spent two nights before the #T20WorldCup semi-final in ICU – then top-scored with 67! https://t.co/YLfJOGFmUO pic.twitter.com/2ztPUsuuWF
— cricket.com.au (@cricketcomau) November 11, 2021
Love you @iMRizwanPak 🇵🇰 pic.twitter.com/49H0RwrZ2U
— Azhar Mashwani (@MashwaniAzhar) November 11, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

