మీర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో.. ఇండియన్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 93 రన్స్ చేశాడు. అయితే శుక్రవారం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. అతను ఓ భారీ షాట్ కొట్టాడు. ఒంటి చేతితోనే సిక్సర్ బాదాడు. ఆ బంతి దాదాపు వంద మీటర్ల దూరంలో పడింది. ఇన్నింగ్స్ 58వ ఓవర్‌ను మెహిదీ హసన్ వేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్.. ఒక చేతితోనే బ్యాట్‌ను పట్టుకుని ఆడేశాడు. ఇక ఆ షాట్‌కు బంతి బౌండరీ బయట పడింది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులందరూ స్టన్ అయ్యారు. పంత్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, అయిదు సిక్సర్లు ఉన్నాయి.
Rishabh Pant hit a 100 meter long six with one hand. 🔥 pic.twitter.com/GkmJLsccJx
— Siddhartha Patel🔥 (@Siddhuu_94) December 23, 2022