FIFA World Cup | బెల్జియంకు షాకిచ్చిన మొరాకో.. బ్రసెల్స్‌లో చెలరేగిన అల్లర్లు..!
FIFA World Cup | ఖతార్ వేదికగా అనూహ్య ఫలితాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంకు 22వ ర్యాంకర్ మొరాకో షాక్ ఇచ్చింది. గ్రూప్-‘ఎఫ్’లో భాగంగా ఆదివారం అల్-తుమామా స్టేడియంలో జరిగిన పోరులో మొరాకో 2-0తో బెల్జియంపై విజయం సాధించింది. జట్టు విజయం మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. మ్యాచ్ అనంతరం ఆదివారం సాయంత్రం తర్వాత మొరాకో అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
FIFA World Cup | ఖతార్ వేదికగా అనూహ్య ఫలితాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంకు 22వ ర్యాంకర్ మొరాకో షాక్ ఇచ్చింది. గ్రూప్-‘ఎఫ్’లో భాగంగా ఆదివారం అల్-తుమామా స్టేడియంలో జరిగిన పోరులో మొరాకో 2-0తో బెల్జియంపై విజయం సాధించింది. జట్టు విజయం మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. మ్యాచ్ అనంతరం ఆదివారం సాయంత్రం తర్వాత మొరాకో అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
బెల్జియంలో దాదాపు 5 లక్షల మంది మొరాకో వాసులు నివసిస్తున్నారు. బెల్జియం ఓటమి పాలయ్యాక.. మొరాకో జెండా కప్పుకున్న పలువురు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో అల్లర్లకు కారణమైంది. కప్పుపై కోటి ఆశలు పెట్టుకున్న బెల్జియం అభిమానులు.. ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. దీంతో కొందరు రాజధానిలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. దుకాణాల అద్దాలను పగలగొట్టారు. నడిరోడ్లపై పలు వాహనాలను తగలబెట్టారు. పోలీసులు రంగంలోకిదిగి ఆందోళనకారులను అదుపు చేసేందుకు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు.
అల్లర్ల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. అలాగే, బెల్జియం తూర్పు నగరమైన లీగ్‌లో 50 మంది ముఠా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. అద్దాలను పగలగొట్టి.. రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించి వారిని చెదరగొట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Joie dans les rues de Paris après la victoire du Maroc ! 🇲🇦#BELMAR #Maroc #MARBEL pic.twitter.com/CDwYML1b6M
— Remy Buisine (@RemyBuisine) November 27, 2022
🇧🇪 Émeutes de colons marocains en #Belgique après le match contre le #Maroc. #BELMAR #Bruxelles pic.twitter.com/MKbS5oeDCn
— Damien Rieu (@DamienRieu) November 27, 2022
Les colons Marocains de #Rotterdam saccagent le centre-ville pour fêter la victoire de leur équipe. #BLGMAR pic.twitter.com/OcxHcicAB4
— Damien Rieu (@DamienRieu) November 27, 2022
https://twitter.com/BasitoAro/status/1596879010729893891?s=20&t=YHTFFX8ge3pPLKmt2WKTug
Contagion
Après #Bruxelles, des violences ont également éclaté à #Amsterdam, #LaHaye et #Rotterdam aux Pays-Bas, après la victoire du #Maroc contre la #Belgique. La police a décidé de déployer les unités anti-émeute et demande aux personnes d'éviter les zones concernées.#BELMAR pic.twitter.com/VS338Hdxro
— Olivier Jorba (@OlivierJorba) November 28, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

