మిగతా ఐపీఎల్ కూడా ఇండియాలోనేనా.. గంగూలీ మాట ఇదీ

ముంబై: ఐపీఎల్ విషయంలో బీసీసీఐ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి. ఊహించని రీతిలో బయో బబుల్‌లోకి కూడా వైరస్ చొరబడి ఆటగాళ్లు దాని బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేశారు. అయితే మిగిలిన లీగ్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు.. అసలు సాధ్యమేనా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. స్పోర్ట్స్‌స్టార్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానుల మదిలో మెదులుతున్న సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారా అని ప్రశ్నించగా.. అది సాధ్యం కాదు. ఇండియన్ టీమ్ శ్రీలంక వెళ్తోంది. పైగా 14 రోజుల క్వారంటైన్‌లాంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఐపీఎల్ ఇండియాలో అసలు కుదరదు. ఈ క్వారంటైన్ చాలా కష్టం. ఐపీఎల్‌ను పూర్తి చేయగలమా లేదా అన్నది ఇప్పుడే ఏమీ చెప్పలేము అని గంగూలీ అన్నారు.
ఇక ముందుగానే ఐపీఎల్‌ను రద్దు చేసి ఉండాల్సిందన్న విమర్శలపైనా దాదా స్పందించారు. ముంబై, చెన్నైలలో ఇలా జరగలేదు. ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్లినప్పుడు బబుల్‌లోకి కూడా కరోనా వచ్చింది. ఆ సమయంలో దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గతేడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ చాలా తక్కువ కేసులు ఉండటంతో ఇంగ్లండ్ సిరీస్‌తోపాటు డొమెస్టిక్ క్రికెట్‌ను విజయవంతంగా నిర్వహించాం. కొన్ని వందల మంది ప్లేయర్స్ బబుల్‌లో ఉన్నా ఏ సమస్యా రాలేదు అని దాదా వివరించారు.
ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్‌లోనూ కేసులు వచ్చాయి. అయినా వాళ్లు లీగ్‌ను కొనసాగించారు. ఐపీఎల్ అలా కాదు. వారం పాటు ఆపితే ఇక అంతే. ప్లేయర్స్ ఇళ్లకు వెళ్లిపోతారు. మళ్లీ వస్త క్వారంటైన్. ఇలా అన్నీ మొదటి నుంచీ మొదలవుతాయి అని గంగూలీ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- EPL
- India Covid cases
- IPL 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

