సిటీబ్యూరో, నవంబర్ 3 ( నమస్తే తెలంగాణ ): మల్టీప్లేయర్ క్రికెట్ గేమింగ్ యాప్ ‘హిట్ వికెట్ సంస్థ’ వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ స్ట్రాటజీ గేమ్ హిట్ వికెట్ సూపర్‌స్టార్స్ యాప్‌ను ప్రారంభించింది. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ ప్రిన్సపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్‌లో వర్చువల్ ద్వారా రియల్ టైంలో ఆడిన అనుభూతి కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తి, కశ్యప్ పాల్గొన్నారు.