RCB vs KKR | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఆర్సీబీ తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో 1.5 బంతికి సిక్స్ కొట్టిన డుప్లెసిస్.. ఆ తర్వాత బంతికే మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది.