IPL 2023 | చిన్నస్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పదహారో సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సొంత గ్రౌండ్ చిన్నస్వామి(Chinna Swamy) స్టేడియంలో ఆదివారం తమ మొత్తం బృందంతో ఆజట్టు ప్రాక్టీస్ చేసింది.
IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పదహారో సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సొంత గ్రౌండ్ చిన్నస్వామి(Chinna Swamy) స్టేడియంలో ఆదివారం తమ మొత్తం బృందంతో ఆజట్టు ప్రాక్టీస్ చేసింది. ఆటగాళ్లు పలు రకాల షాట్లు ఆడుతూ కనిపించారు. ఆ జట్టు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రాక్టీస్‌లో భారీ షాట్లు ఆడి అభిమానులను అలరించారు.
ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈరోజు తమ జట్టు జెర్సీని విడుదల చేయనుంది. అంతేకాదు ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మాజీ క్రికెటర్లు క్రిస్ గేల్ (Chris Gayle), ఏబీ డివిల్లియర్స్(AB de Villiers) కు చోటు కల్పించనుంది. అంతకాదు వీళ్ల జెర్సీ నంబర్లను(గేల్ 17, డివిల్లియర్స్ 333) మరెవరికీ కేటాయించకూడదని కూడా ఫ్రాంఛైజీ నిర్ణయించుకుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఈసారైనా కప్పు కొట్టేనా..?
పదిహేను సీజన్లలో ఆర్సీబీ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేదు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ వంటి స్టార్లు ఉన్నా కూడా ఆ జట్టు ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయింది. రెండుసార్లు ఫైనల్ చేరినా విజేతగా మాత్రం నిలవలేదు. గత సీజన్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆర్సీబీతో కలిశాడు. అయితే.. ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా ఈసీజన్లో కొన్ని మ్యాచ్‌లకు మిస్ అయ్యే అవకాశం ఉంది. కోహ్లీ ఫామ్ అందుకోవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈసారైనా తమ జట్టు కప్పు కొట్టాలని వాళ్లంతా బలంగా కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
Swiss Open 2023 | స్విస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్
Rohit Sharma | డబ్ల్యూపీఎల్ ఫైనల్.. హర్మన్‌ప్రీత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెప్పిన హిట్‌మ్యాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

