WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్‌లో అంతిమ పోరుకు వేళైంది. రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అమీతుమీకి తేల్చుకోనుంది. మూడుసార్లు ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ.. నాలుగో ప్రయత్నంలోనైనా కప్‌ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది. కానీ, జట్టు నిండా మ్యాచ్ విన్నర్లతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆర్సీబీని దాటితేనే జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) నేన తొలిసారి ట్రోఫీని ముద్దాడుతుంది. ఆనవాయితీ ప్రకారం.. గత మూడు సీజన్లలో ఎలిమినేటర్ విజేతనే ట్రోఫీ వరించింది. ఈ సంప్రదాయం కొనసాగితే గుజరాత్ జెయింట్స్‌ను దెబ్బకొట్టి.. ఫైనల్‌కు దూసుకొచ్చిన ఢిల్లీ కప్ కల సాకారమైనట్టే.
గత మూడు సీజన్లకు విభిన్నంగా ఉత్కంఠ పోరాటాలతో, ఆఖరి ఓవర్ థ్రిల్లర్లతో అసలైన క్రికెట్ మజాను పంపిన నాలుగో సీజన్లో ఛాంపియన్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆరు విజయాలతో నేరుగా ఫైనల్లో వాలిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో టైటిల్‌పై గురి పెట్టగా.. తొలి ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తగ్గేదేలే అంటోంది. లీగ్ దశలో చెరొక మ్యాచ్ గెలిచినందున.. ఆఖరి పంచ్ విసేరిన జట్టే కప్‌ను తన్నుకుపోనుంది.
2⃣ leaders 🫡
1⃣ iconic trophy 🏆Who will get their hands on the #TATAWPL 2026 title tomorrow? 🤩#ClaimTheCrown | #RCBvDC | #Final | @RCBTweets | @DelhiCapitals pic.twitter.com/a2YVFd7izL
— Women’s Premier League (WPL) (@wplt20) February 4, 2026
ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుచేసిన ఢిల్లీ.. గురువారం వడోదరలో ఆర్సీబీతో టైటిల్ పోరుకు కాచుకుంది. ఆరంభ సీజన్లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా అవతరించింది. రెండో సీజన్లోనూ ఇదే ఒరవడి కొనసాగగా ఆర్సీబీ విజేతగా నిలిచింది. మూడో సీజన్లోనూ ఎలిమినేటర్‌లో నెగ్గిన ముంబై.. ఫైనల్లో ఢిల్లీకి గుండెకోతను మిగిల్చింది. ఇప్పుడు ఎలిమినేటర్‌లో విజయంతో నాలుగోసారి కప్ కోసం వచ్చిన ఢిల్లీ.. సర్వశక్తులు ఒడ్డితేనే వారిపై పడిన చోకర్స్ అనే ముద్ర చెరిగిపోతుంది.
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పాలిట వరంలా దొరికింది ఓపెనర్ లీజెల్లీ లీ(283 పరుగులు). అగ్నికి వాయువు తోడైనట్టు షఫాలీ వర్మ(239 పరుగులు) జతగా లీ కొనసాగిస్తున్న విధ్వంసంతో ఢిల్లీ ఫైనల్ బెర్తు దక్కించుకుంది. వీరిద్దరూ అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పిన మూడు మ్యాచుల్లో ఢిల్లీ గెలుపొందింది. గత 9 మ్యాచుల్లో 361 రన్స్ రాబట్టిన ఈ డేంజరస్ జోడీనే జెమీమా రోడ్రిగ్స్ బృందం నమ్ముకుంది.
DC are 3-0 in matches where Shafali and Lee have put on a half-century stand 🤝 pic.twitter.com/ROKPzsaddG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2026
చివరి రెండు మ్యాచుల్లో ఇరగదీసిన లారా వొల్వార్డ్త్, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఫినిషర్‌గానూ రాణిస్తున్న జెమీమాపై భారీ బాధ్యత ఉంది. బౌలింగ్ పరంగా.. మరిజానే కాప్, నందిని శర్మ(16 వికెట్లు)లతో బెంగళూరుకు ముప్పు పొంచి ఉంది. స్నేహ్ రానా, శ్రీ చరణి, మిన్ను మణిలు స్పిన్‌తో ఇరుకునపెట్టగలరు. లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీని 108కే ఆలౌట్ చేయడంలో కీలకమైన పేసర్ మరిజానే కాప్ ఫైనల్లోనూ చెలరేగితే ఢిల్లీ కొప్పున కప్పు విరబూయడం ఖాయం.
Delhi Capitals remain the only team to reach the playoffs in every WPL season!
👏 👏 👏 pic.twitter.com/Xz8Q1gpChe
— Cricbuzz (@cricbuzz) February 2, 2026
రెండో సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ.. ఈసారి ఆధిపత్యం చెలాయిస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది. బౌండరీలతో భయపెట్టే ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(228 పరుగులు).. కెప్టెన్ స్మృతి మంధాన బెంగళూరకు ప్రధాన బలం. వీరు విఫలమైనా.. మిడిలార్డర్లో గౌతమీ, రీచా ఘోష్, రాధా యాదవ్, నడినే డీక్లెర్క్‌లు ఫినిషర్‌గా అదరగొడుతున్నారు.
RCB’s road to the WPL final pic.twitter.com/40NNjBHWdS
— Cricbuzz (@cricbuzz) February 5, 2026
పవర్ ప్లేలోనే వికెట్ల వేటతో ఆర్సీబీ విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న లారెన్ బెల్(12 వికెట్లు), సయాలీ సత్ఘరే(8 వికెట్లు)లు ఫైనల్లోనూ విజృంభిస్తే ఢిల్లీ బ్యాటర్లు బెంబెలెత్తిపోవాల్సిందే. స్పిన్నర్ శ్రేయాంక పాటిల్, బంతితోనూ మెరుస్తున్న నడినే (15 వికెట్లు) నుంచి కూడా ఢిల్లీకి సమస్యలు తప్పకపోవచ్చు.