Ravindra Jadeja | ఊతకర్రల సాయంతో నడుస్తున్న జడ్డూ.. ఫొటో వైరల్
Ravindra Jadeja | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆసియా కప్ మధ్యలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన జడ్డూ.. వచ్చే నెలలో ప్రారంభం అవనున్న టీ20 ప్రపంచకప్ కూడా ఆడటం
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆసియా కప్ మధ్యలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన జడ్డూ.. వచ్చే నెలలో ప్రారంభం అవనున్న టీ20 ప్రపంచకప్ కూడా ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. మైదానంలో అత్యంత చురుకుగా ఉండే ఫీల్డర్లలో జడ్డూ ఒకడు. ఈ తరంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా అతడిని క్రీడాలోకం భావిస్తుంది. ఇటీవల బ్యాటుతో, బంతితో రాణిస్తూ టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడీ సౌరాష్ట్ర ఆటగాడు.
అయితే మోకాలి గాయంతో బౌలింగ్ చేయడం కూడా కష్టంగా మారడంతో జట్టును వీడాల్సి వచ్చింది. ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న అతను.. ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోకు ‘వన్ స్టెప్ ఎట్ ఎ టైం’ (ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న) అని క్యాప్షన్ జతచేశాడు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

