Ravi Shastri : ఐపీఎల్లో స్లార్లు ఎందురున్నా విధ్వంసక ఆటతో బౌలర్లపై విరుచుకుపడుతున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలుస్తున్నాడు. తొలి బంతి నుంచే బాదడుకు తెరతీసే ఈ కుర్రాడిని భావి తారగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. అంతేనా.. వైభవ్‌ను భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పదిహేనేళ్లకే ప్రపంచ స్థాయి బౌలర్లను భయపెడుతున్న ఈ చిచ్చరపిడుగును ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడించాలని మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri ) అభిప్రాయపడుతున్నాడు.
పద్దెనిమిదో సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. పంతొమ్మిదోలో తన పత్రాపాన్ని చూపిస్తున్నాడు. మంచినీళ్లు తాగినంత సులువగా సిక్సర్లు బాదుతూ.. రికార్డు శతకం కొట్టిన ఈ యంగ్‌స్టర్.. భారత జట్టు వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఏ జట్టులోకి వచ్చిన వైభవ్‌ను సీనియర్ జట్టులోనూ ఆడించాలని అంటున్నాడు రవి శాస్త్రి. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌తో శాస్త్రి మాట్లాడుతూ.. వైభవ్‌కు భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయని అన్నాడు.
Ravi Shastri believes India’s teenage cricketing sensation might be on the verge of making a historic international debut 🤩
More from #TheICCReview 👇https://t.co/vFWMHygcmH
— ICC (@ICC) May 17, 2026
‘నేను మీకో విషయం చెబుతాను. ప్రతిభావంతుడైన వైభవ్ లాంటి వాళ్లను ప్రోత్సహించాలంటే వెంటనే అవకాశాలివ్వాలి. టీ20 ఫార్మాట్‌కు వైభవ్ ఏ విషయంలోనూ తీసిపోడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న అతడు ప్రపంచ క్రికెట్లో ఎన్నో శిఖరాలు అధిరోహిస్తాడు. అందుకు మనం అవకాశం ఇవ్వాలి. వైభవ్ 15 ఏళ్ల పిల్లాడు, అతడికి 16 ఏళ్లుంటాయి కాదు14 ఏళ్లున్నాయి అని చాలామంది మాట్లాడుతున్నారు.
తనకంటే వయసులో రెండింతలు పెద్దవారైన బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు చూడండి. అతడికి వయసు అనేది సమస్యే కాదు. నా ఉద్దేశంలో వైభవ్ ఎంతో సమర్ధుడు. ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే అతడు అద్భుతాలు చేస్తాడు. నేనైతే అతడిని గమనిస్తుంటాను’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ అనంతరం శ్రీలంక గడ్డపై భారత ఏ జట్టు ముక్కోణపు సిరీస్ ఆడనుంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్ పర్యటన మొదలవ్వనుంది. అయితే.. ఏ జట్టుకు ఎంపికైన వైభవ్‌ను ఐర్లాండ్ సిరీస్‌కు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Ravi Shastri has backed Vaibhav Sooryavanshi to make his debut for India sooner rather than later, given his impressive performances during the ongoing IPL season.#TeamIndia pic.twitter.com/g3k3x68noA
— Circle of Cricket (@circleofcricket) May 17, 2026
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారీ శతకం(175)తో టీమిండియాను గెలిపించిన వైభవ్.. ఐపీఎల్‌నూ దంచేస్తున్నాడు. ఓపెనర్‌గా రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభాలిస్తూ.. 11 ఇన్నింగ్స్‌ల్లో ఈ చిచ్చరపిడుగు 236.56 స్ట్రయిక్ రేటుతో 440 రన్స్ కొట్టేశాడు. సన్‌రైజర్స్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకంతో ఐపీఎల్లో మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు నెలకొల్పా డు.

18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే ఈ లెఫ్ట్ హ్యాండర్ శతకంతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) 30 బంతుల్లోనే వందతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.