SLW vs ENGW : వరల్డ్ కప్ గ్రూప్ దశలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (67 నాటౌట్) పోరాడుతోంది. సహచరులు విఫలమైనా జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు శ్రమిస్తోంది. శ్రీలంక స్పిన్నర్ ఇనోకా రణవీర (3-31) మూడు వికెట్లు తీసి మిడిలార్డర్‌ను దెబ్బకొట్టగా.. ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. సోఫియా డంక్లే(18)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది.
అయితే.. కవిష దిల్మరి రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది. దాంతో, 37 పరుగుల భాగస్వా్మ్యా నికి తెరపడింది. ఆ తర్వాత రణవీర తిప్పేయగా ఎమ్మా లాంబ్ (13), ఆల్‌రౌండర్ అలిసే క్యాప్సే(0)లు వెనుదిరిగారు. చార్లీ డీన్ జతగా జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే పనిలో ఉంది బ్రంట్.
36 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్. 169/6.
Lamb ❌
Capsey ❌A double-wicket maiden from Inoka Ranaweera!
Charlie Dean joins Nat Sciver-Brunt in the middle with England 168/6 after 35 overs
🔗 https://t.co/lyGJAp7XJf | #CWC25 pic.twitter.com/8vq3lTMWq6
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2025