RR vs GT | ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గుజరాత్‌కు చుక్కెదురు.. రాజస్థాన్‌కు రెండో విజయం..!
RR vs GT : ఐపీఎల్లో ఏకపక్ష మ్యాచ్‌లతో విసిగిపోయిన అభిమానులను ఉత్కంఠ పోరు అలరించింది. భారీ స్కోర్ల పోరులో ఆఖరి ఓవర్ వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌నే విజయం వరించింది.
RR vs GT : ఐపీఎల్లో ఏకపక్ష మ్యాచ్‌లతో విసిగిపోయిన అభిమానులను ఉత్కంఠ పోరు అలరించింది. భారీ స్కోర్ల పోరులో ఆఖరి ఓవర్ వరకూ ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌నే విజయం వరించింది. 211 పరుగుల ఛేదనలో సాయి సుదర్శన్(73) మెరుపులతో గెలుపు దిశగా సాగిన గుజరాత్ టైటాన్స్‌ను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4-41)దెబ్బతీశాడు. చివరి ఓవర్లో ఆ జట్టు గెలవాలంటే 10 చేయల్సి రాగా.. తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్‌ను గెలిపించాడు. యార్కర్లతో గుజరాత్ బ్యాటర్లను నిలువరించిన ఈ కుర్రాడు 4 పరుగులే ఇవ్వడంతో రియాన్ పరాగ్ సేన వరుసగా రెండో విక్టరీ కొట్టింది.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయంతో మురిసింది. భారీ స్కోర్‌తో గుజరాత్ టైటాన్స్‌కు సవాల్ విసిరిన రాజస్థాన్ బౌలర్ల విజృంభణతో మ్యాచ్‌ను కాపాడుకుంది. భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన గుజరాత్ టైటాన్స్.. ఊహించని విధంగా తడబడింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(73), కుషగ్ర(18)లు తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి గెలుపు దిశగా నడిపారు. కానీ, కుషగ్రను ఔట్ చేసి బ్రేకివ్వగా.. అర్ధ శతకంత తర్వాత సుదర్శన్ వెనుదిరిగాడు.
Ice in his veins 🧊
Fire in his bowling 🔥A 𝗰𝗹𝘂𝘁𝗰𝗵 𝗳𝗶𝗻𝗮𝗹 𝗼𝘃𝗲𝗿 from Tushar Deshpande 🫡
Scorecard ▶️ https://t.co/6D02Fh0IHv#TATAIPL | #KhelBindaas | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/HONB2237Kz
— IndianPremierLeague (@IPL) April 4, 2026
బిష్ణోయ్ .. రెండు వికెట్లతో
జోస్ బట్లర్(26) ఉన్నాడన్న ధీమాతో ఉన్న గుజరాత్‌ను ఇంప్యాక్ట్ సబ్ రవి బిష్ణోయ్(4-41) దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో డేంజరస్ గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్(0)… రెండు వికెట్లతో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. ఆ తర్వాతి ఓవర్లో బట్లర్‌ను బర్గర్ బోల్తా కొట్టించాడు. అంతే.. అప్పటివరకూ పటిష్ట స్థితిలో ఉన్న గుజరాత్ ఒక్కసారిగా పడిపోయింది.
ఇంప్యాక్ట్ సబ్ షారుక్ ఖాన్(11) వస్తూనే సిక్స్, ఫోర్‌తో తెగబడ్డాడు. తన ఓవర్లో రెండు ఫోర్లు బాదిన రాహుల్ తెవాటియా(12)ను ఔట్ చేసి ప్రత్యర్ధిని మరింత ఒత్తిడిలో పడేశాడు. రెండో పరుగుకు యత్నించిన షారుక్ రనౌట్ కావడంతో గుజరాత్ విజయావకాశాలు దెబ్బతిన్నాయి. కానీ, కెప్టెన్ రషీద్ ఖాన్(24), కగిసో రబడ(23 నాటౌట్)లు పట్టు వదలకుండా బౌండరీలతో భయపెట్టారు. సందీప్ శర్మ ఓవర్లో రబడ సిక్సర్ బాదడంతో మ్యాచ్ గుజరాత్ వైపు మొగ్గింది. దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమవ్వగా.. ఊదో బంతికి రషీద్ సిక్సర్‌కు ప్రయత్నించగా బౌండరీ వద్ద ఆర్చర్ క్యాచ్ అందుకున్నాడు. చివరి బంతికి రావడంతో రాజస్థాన్ ఊపిరి పీల్చుకుంది.
మెరిసిన జురెల్, యశస్వీ
అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) అర్ధ శతకాలతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దళాన్ని కకావికలం చేశారు. వైభవ్ సూర్యవంశీ(31)తో కలిసి మెరుపు ఆరంభమిచ్చిన యశస్వీ.. జురెల్ జతగా మరింత రెచ్చిపోయాడు. ఆఖర్లో షిమ్రన్ హిట్మైర్(18) ధనాధన్ ఆడడంతో రాజస్థాన్ రెండొందల మార్క్ అందుకుంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో కంగుతిన్న గుజరాత్ ముందు 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

