IPL 2024 Mini Auction | ఈసారి రికార్డు ధర పలికేది వీళ్లే.. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో చెప్పేసిన అశ్విన్
IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు దుబాయ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలంపాట షురూ కానుంది. ఈసారి సాంప్రదాయానికి విరుద్దంగా ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) వేలాన్ని...
IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు దుబాయ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి వేలంపాట షురూ కానుంది. ఈసారి సాంప్రదాయానికి విరుద్దంగా ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) వేలాన్ని నిర్వహించనుంది. దాంతో, కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. తాజాగా భారత జట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandra Ashwin) మినీ వేలంలో అత్యధిక ధర పలికేది ఎవరో చెప్పేశాడు.
ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో అశ్విన్ క్రికెట్ షాట్లు ఆడుతూ.. ఎవరెవరు ఎంత ధరకు అమ్ముడుపోతారు? అనేది ఊహించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins), స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) రూ. 14 కోట్లపైనే పలుకుతారని అశ్విన్ చెప్పాడు. ఇక.. భారత యువ కెరటం షారుక్ ఖాన్, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగలు రూ. 10 నుంచి రూ.14 కోట్లు కొల్లగొడుతారని అన్నాడు.
ఆర్సీబీ వదులుకున్న భారత పేసర్ హర్షల్ పటేల్(Harshal Patel), దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీలు రూ. 7 నుంచి 10 కోట్లకు అమ్ముడుపోతారని అశ్విన్ తెలిపాడు. ఇక భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో దంచికొట్టిన న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర, భారత పేసర్ ఉమేశ్ యాదవ్, విండీస్ విధ్వంసక ఆటగాడు రొవ్మన్ పావెల్ రూ.4 కోట్ల నుంచి రూ. 7 కోట్ల ధర పలికే అవకాశముందని అశ్విన్ ఊహించాడు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ పలుకుతాడని యశ్ చెప్పేశాడు.
మల్లికా సాగర్

డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలం మొదలవ్వనుంది. ఈసారి 1,166 మంది పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 830 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ మొత్తం జాబితాలో 212 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 909 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా ఈసారి 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. నిరుడు కొచ్చిలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(Sam Curran) రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు కొన్నది. ఈసారి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరకు రిజిష్టర్ అయిన ఆటగాళ్లు వీళ్లే..
భారత్ – హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్.
ఇంగ్లండ్ – హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్.
ఆస్ట్రేలియా – ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, సియాన్ అబాట్.
దక్షిణాఫ్రికా – రీలే రస్సో, రసీ వాండర్ డస్సెన్, గెరాల్డ్ కోయెట్జీ.
అఫ్గనిస్థాన్ – ముజీబ్ ఉర్ రెహ్మాన్.
బంగ్లాదేశ్ – ముస్తాఫిజుర్ రెహ్మాన్.
శ్రీలంక – ఏంజెలో మాథ్యూస్.
ఇవి కూడా చదవండి
- Odisha Masters | నంబర్ 1 జోడీని మట్టికరిపించి.. గోల్డ్ మెడల్ సాధించిన ధ్రువ్, తనీశ
- Covid-19 | దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఐదుగురు మృతి
- Big Boss-7 | రెచ్చిపోయిన ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు.. ఆర్టీసీ బస్సుపై దాడి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

