Covid-19 | దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఐదుగురు మృతి
దేశంలో కరోనా మహమ్మారి (Covid-19) మరోసారి విజృంభిస్తున్నది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి (Covid-19) మరోసారి విజృంభిస్తున్నది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళలోనే (Kerala) ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,701 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,04,816) దాటింది. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పింది.
కాగా, కేరళలో జేఎన్-1 (JN.1) అనే కొత్త కరోనా వేరియంట్ బయటపడిన విషయం తెలిసింది. దీనివల్ల 73 ఏండ్ల మహిళ సహా నలుగురు మరణించగా, ఉత్తరప్రదేశ్లో ఒకరు చనిపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

