IPL 2023 | చెన్నై ఇన్నింగ్స్‌కు అంతరాయం.. వర్షం కారణంగా నిలిచిన ఆట
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. దాంతో, రెండో ఇన్నింగ్స్ నిలిచిపోయింది. చెన్నై బ్యాటింగ్ ఆరంభానికి ముందు చిన్న జల్లులు పడ్డాయి. కొద్ది సేపటికే చినుకులు తగ్గడంతో సిబ్బంది గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. తొలి ఓవర్ మూడో బంతి పడగానే మళ్లీ వర్షం మొదలైంది.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. రిజర్వ్ డే రోజు కూడా వాన వదలడం లేదు. దాంతో, రెండో ఇన్నింగ్స్ నిలిచిపోయింది. చెన్నై బ్యాటింగ్ ఆరంభానికి ముందు చిన్న జల్లులు పడ్డాయి. కొద్ది సేపటికే చినుకులు తగ్గడంతో సిబ్బంది గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. తొలి ఓవర్ మూడో బంతి పడగానే మళ్లీ వర్షం మొదలైంది. షమీ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(4) మూడో బంతికి ఫోర్ బాదాడు. ఆ తర్వాత వర్షం మొదలైంది. దాంతో, సిబ్బంది పరుగున వచ్చి పిచ్‌ను కవర్లతో కప్పేశారు. డెవాన్ కాన్వే(0) క్రీజులో ఉన్నాడు.
Rain stops play in Ahmedabad 🌧️🌧️
Stay tuned for further updates.
Scorecard ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/miY8emHBWz
— IndianPremierLeague (@IPL) May 29, 2023
సుదర్శన్ సునామీలా..
ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. సొంత గ్రౌండ్లో టాపార్డర్ బ్యాటర్లు దంచి కొట్టారు. గత మ్యాచ్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్(39) విఫలమైనా.. సాయి సుదర్శన్(96: 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(54 : 39 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది. ఐపీఎల్ ఫైనల్లో రికార్డు స్కోర్ చేసిన జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. 2016 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కొట్టిన 208/7 స్కోర్‌ను అధిగమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

