IND vs WI : సిరీస్ డిసైడర్ అయిన ఐదో టీ20కి వరుణుడు అంతరాయం కలిగించాడు. 15.5 ఓవర్ల సమయంలో చినుకులు మొదలయ్యాయి. వర్షం పడే సమయానికి 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ ఫార్మాట్లో సూర్యకు ఇది 15వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
FIFTY for Suryakumar Yadav! 👏 👏
His 1⃣5⃣th T20I half-century 👌👌
Follow the match ▶️ https://t.co/YzoQnY6OpV#TeamIndia | #WIvIND pic.twitter.com/jsTWj95Eff
— BCCI (@BCCI) August 13, 2023
టాస్ గెలిచిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(5), శుభ్‌మన్ గిల్(9) విఫలమయ్యారు. వీళ్లిద్దరిని అకీల్ హొసేన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(27) ధాటిగా ఆడాడు. కానీ, రోస్టన్ చేజ్ అద్బుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. సంజూ శాంసన్ (13 ) మరోసారి తక్కువకే ఔటయ్యాడు.