RR vs RCB | ఐపీఎల్‌ను వదలని వరుణుడు.. ఆర్సీబీ, రాజస్థాన్ మ్యాచ్ టాస్ వాయిదా..!
RR vs RCB : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ వర్షార్పణం కాగా.. గువాహటిలో మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగిస్తోంది.
RR vs RCB : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ వర్షార్పణం కాగా.. గువాహటిలో మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగిస్తోంది. లీగ్ దశలో ఓటమెరుగని రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అడ్డుపడుతోంది. టాస్కు ముందే మొదలైన చినుకులు చూస్తుండగానే ఎక్కువయ్యాయి. భారీగా వర్షం పడుతున్నందున అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు.
హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, వరసగా రెండు విజయాలతో జోరు మీదున్న ఆర్సీబీ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. టాస్ సమయానికి గువాహటిలో వాన పడడమే అందుకు కారణం. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లన్నీ ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. రికార్డులు గమనిస్తే రాజస్థాన్‌పై 17-14తో బెంగళూరు ఆధిపత్యం చెలాయించింది. 2023 నుంచి ఇరుజట్లు ఆరు మ్యాచుల్లో తలపడగా ఆర్సీబీ నాలుగు పర్యాయాలు విజేతగా నిలిచింది.
🚨 UPDATE 🚨
Toss is delayed. Stay tuned for further updates.#TATAIPL | #KhelBindaas | #RRvRCB
— IndianPremierLeague (@IPL) April 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

