మీరాబాయి చానుకు బంపర్ ప్రైజ్.. రూ.2 కోట్లు, రైల్వేలో ప్రమోషన్

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసింది. ఈ సందర్భంగా మీరాబాయిని ఆయన సన్మానించారు. అంతేకాదు రూ.2 కోట్ల నగదు, ఈశాన్య రైల్వేలో ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరాబాయి తన నైపుణ్యం, కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో కోట్లాది మంది భారతీయులలో స్ఫూర్తి నింపిందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆమెను కలవడం, సన్మానించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న ఆమెను ఇప్పుడు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేశారు.
It was great to meet and congratulate the pride of India and honour of Indian Rly, @mirabai_chanu. Also felicitated her & announced Rs. 2 Cr , a promotion and more. She has inspired billions around the world with her talent, handwork and grit.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 26, 2021
Keep winning for India! pic.twitter.com/gYRftarOrr
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

