Rahul Dravid | సారథిగా విఫలమై.. కోచ్‌గా గెలిచిన రాహుల్ ద్రవిడ్
2007 మార్చిలో వెస్టిండీస్ గడ్డ మీదే జరిగిన వన్డే ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దిగ్గజాలతో కూడిన టీమ్ఇండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఓడిపోవడం ఒకటైతే అప్పటికీ పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతిలో పరాభవం భారత అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.
Rahul Dravid | 2007 మార్చిలో వెస్టిండీస్ గడ్డ మీదే జరిగిన వన్డే ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దిగ్గజాలతో కూడిన టీమ్ఇండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఓడిపోవడం ఒకటైతే అప్పటికీ పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతిలో పరాభవం భారత అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. నాడు భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. సరిగ్గా 17 ఏండ్ల తర్వాత తాను పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్టు సారథిగా విఫలమైనా హెడ్‌కోచ్‌గా ట్రోఫీ అందుకున్నాడు.
సుమారు దశాబ్దన్నర పాటు ‘మిస్టర్ డిపెండబుల్’గా భారత బ్యాటింగ్ భారాన్ని తన భుజాలపై మోసిన ద్రవిడ్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించాక బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో యువ క్రికెటర్లను సానబెట్టే బాధ్యతను తీసుకున్నాడు. రవిశాస్త్రి నుంచి 2021లో భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ పగ్గాలు అందుకున్న ద్రవిడ్.. మూడున్నరేండ్ల పాటు ‘మెన్ ఇన్ బ్లూ’ను విజయవంతంగా నడిపించాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచింది.
ఈ మూడేండ్ల కాలంలో రోహిత్ శర్మ సారథ్యాన భారత జట్టు అద్భుతాలు సృష్టించింది. ద్రవిడ్ హయాంలో భారత్.. మూడు సార్లు (2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్) ఐసీసీ టోర్నీలలో ఫైనల్ చేరగా 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ దాకా వెళ్లింది. వాస్తవానికి గతేడాదే ద్రవిడ్ పదవీకాలం ముగిసినా బీసీసీఐ దానిని టీ20 వరల్డ్‌కప్ దాకా పొడిగించింది. కోచ్‌గా తన ఆఖరి మ్యాచ్‌ను ద్రవిడ్ విజయవంతంగా ముగించడం విశేషం.

-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

