Rahul Dravid: ముగిసిన కాంట్రాక్టు.. ద్రావిడ్ భవితవ్యమేంటి..! ఉంచుతారా.. దించుతారా..?
Rahul Dravid: 2021 నవంబర్‌లో భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్.. మూడు ఐసీసీ టోర్నీలలో భారత్‌ను నాకౌట్ దశకు చేర్చినా కప్పు మాత్రం అందించడంలో సక్సెస్ కాలేకపోయాడు.
Rahul Dravid: రెండేండ్ల క్రితం రవిశాస్త్రి నుంచి హెడ్‌కోచ్ బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం నిన్న ముగిసిన వన్డే వరల్డ్ కప్‌తో ముగిసింది. 2021 నవంబర్‌లో భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రావిడ్.. మూడు ఐసీసీ టోర్నీలలో భారత్‌ను నాకౌట్ దశకు చేర్చినా కప్పు మాత్రం అందించడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో మరి ద్రావిడ్ భవితవ్యం ఏంటి..? మిస్టర్ వాల్‌ను ఉంచుతారా..? దించుతారా..? ఒకవేళ దించితే ఇప్పటికిప్పుడు భారత జట్టుకు మార్గదర్శకత్వం చేసే కోచ్ ఎవరు..?
2021లో విరాట్ కోహ్లీ – రవిశాస్త్రిల ధ్వయం దాదాపు ఒకేసారి కెప్టెన్, కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆ భారాన్ని బీసీసీఐ.. రోహిత్ – ద్రావిడ్‌ల పై మోపింది. మిస్టర్ కూల్‌గా పేరున్న ఈ జోడీ భారత్‌కు సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ టోర్నీలలో భారత్‌ను విజయతీరాలకు చేర్చుతారని బీసీసీఐతో పాటు అభిమానులూ భావించారు. ఈ ఇద్దరూ తొలిసారి 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ టోర్నీలో భారత్.. సెమీస్‌లోనే ఇంటికొచ్చింది. ఇక ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ (డబ్ల్యూటీసీ ఫైనల్)లో కూడా తుది మెట్టు మీద బోల్తా కొట్టింది. ఇవి రెండు పోయినా స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌లో అయినా ఐసీసీ ట్రోఫీ దక్కుతుందని భావించినా మళ్లీ దురదృష్టం భారత్ వైపే నిలిచింది.
ద్రావిడ్ ఏమంటున్నాడు..?
వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ద్రావిడ్ ఇదే విషయమై మాట్లాడుతూ తానైతే ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదని, త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతానికి తన ఆలోచనలన్నీ ఓటమి బాధలో ఉన్న ఆటగాళ్లమీదే ఉన్నాయని, అంతకుమించి తాను మరేమీ ఆలోచించడం లేదని తెలిపాడు.
కాలమే నిర్ణయించాలి..
ద్రావిడ్ వెర్షన్ ఇలా ఉంటే బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై తంటాలు పడుతోంది. ద్రావిడ్ మీద గంపెడాశలు పెట్టుకున్నా అతడు కూడా భారత కలను నిజం చేయలేకపోయాడు.భారత్ చివరిసారి డంకెన్ ఫ్లెచర్ ఆధ్వర్యంలో ఐసీసీ ట్రోఫీ (2013లో ఛాంపియన్స్ ట్రోఫీ) నెగ్గింది. ఆ తర్వాత టీమిండియా 2014 నుంచి పరాభవాలనే మూటగట్టుకుంటోంది. ఫ్లెచర్ తర్వాత భారత్‌కు విదేశీ కోచ్‌గా ఎవరూ చేయలేదు. అయితే ఐసీసీ నాకౌట్ దశలో ఓడటం తప్పితే భారత జట్టు ప్రదర్శన బాగోలేదనడానికి కూడా లేదు. ద్రావిడ్ హయాంలో కూడా భారత్ మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా నిలిచింది. మరి ద్రావిడ్ ను కొనసాగిస్తారా..? లేక విదేశీ కోచ్‌కు మొగ్గు చూపుతారా..? అన్నది కాలమే నిర్ణయించాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

