ఎంఎస్ఎల్ విజేత రేజింగ్ బుల్స్
మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రెనోవా మాస్టర్స్ సూపర్ క్రికెట్ లీగ్ (ఎంఎస్ఎల్) ఒకటో సీజన్ విజేతగా రేజింగ్ బుల్స్ నిలిచింది. ప్రైమ్ ఎరీనాలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో బుల్స్ జట్టు..
హైదరాబాద్, ఆట ప్రతినిధి : మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రెనోవా మాస్టర్స్ సూపర్ క్రికెట్ లీగ్ (ఎంఎస్ఎల్) ఒకటో సీజన్ విజేతగా రేజింగ్ బుల్స్ నిలిచింది. ప్రైమ్ ఎరీనాలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో బుల్స్ జట్టు.. 3 వికెట్ల తేడాతో సన్క్రెస్ట్ వారియర్స్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్క్రెస్ట్.. 20 ఓవర్లకు 157/6 స్కోరు చేసింది. రామ్ పాటిల్ (40) రాణించగా బుల్స్ సారథి కెప్టెన్ హరీష్ (3/18) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో బుల్స్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. పవన్ (47), అబిద్ అజారుద్దీన్ (41) రాణించారు. తొలి సీజన్‌కు అనూహ్య స్పందన రావడంతో వచ్చే ఏడాది నుంచి ఏటా రెండు సీజన్లు నిర్వహిస్తామని ఎంసీఏహెచ్ అధ్యక్షుడు ఎస్పీ రెడ్డి తెలిపారు. ముగింపు వేడుకల్లో ఎంసీఏహెచ్ ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి సునీల్‌రెడ్డి, కోశాధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

