Rafeal Nadal | టెన్నిస్ కోర్టులో ఫుట్‌బాల్.. ఫ్యాన్స్‌ను అలరించిన స్పెయిన్ బుల్
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్(Rafeal Nadal) 12 నెలల తర్వాత బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ (Brisbane International) టోర్నీతో పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియాలో ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్ ఆసాంతం చురుకుగా కదులుతూ,,,
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్(Rafeal Nadal) 12 నెలల తర్వాత బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ (Brisbane International) టోర్నీతో పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియాలో ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్ ఆసాంతం చురుకుగా కదులుతూ మునపటి నాదల్‌ను గుర్తు చేశాడు. 37 ఏండ్ల ఈ స్పెయిన్ బుల్ ఈ మ్యాచ్‌లో తన ఫుట్‌బాల్ స్కిల్స్(Football Skills)తో ఫ్యాన్స్‌ను అలరించాడు.
మార్క్ లోపెజ్(Mark Lopez)తో జోడీ కట్టిన నాదల్ మ్యాచ్ మధ్యలో ఫుట్‌బాల్ ఆడి బాల్ గర్ల్‌కు బంతిని ఇచ్చాడు. దాంతో, అక్కడి అభిమానులు చప్పట్లు కొడుతూ రఫాను అభినందించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన జోర్డన్ థాంప్సన్, మాక్స్ పౌర్సెల్ జోడీ 4-6, 4-6తో రఫా ద్వయాన్ని ఓడించింది.
Stop that, @RafaelNadal 🥶#BrisbaneTennis pic.twitter.com/2KO7wmHdF0
— Brisbane International (@BrisbaneTennis) December 31, 2023
నాదల్ తర్వాత పురుషుల సింగిల్స్ యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డోమ్నిక్ థీమ్(Domni Theim)ను ఢీకొట్టనున్నాడు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాదల్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత తొడకండరాల గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరమైన ఈ స్టార్ ప్లేయర్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించాడు.
నాదల్, థీమ్

నాదల్, థీమ్ ఇప్పటివరకూ 15 సార్లు తలపడ్డారు. అయితే.. రికార్డు స్థాయిలో స్పెయిన్ బుల్ 9 సార్లు గెలుపొందగా.. థీమ్ రెండు సార్లు పై చేయి సాధించాడంతే. అది కూడా కీలకమైన ఏటీపీ ఫైనల్స్, 2022 ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో థీమ్.. రఫాను చిత్తు చేశాడు. దాంతో, ఈసారి ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
- Benjamin Kiplagat | కెన్యాలో మారథాన్ రన్నర్ దారుణ హత్య.. మెడ, ఛాతిపై కత్తిపోట్లు
- New Year | ఆధ్యాత్మిక శోభ.. కొత్త ఏడాది భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
- Muhammad Waseem | ఒకే ఏడాది 100 సిక్సర్లు.. స్టార్ క్రికెటర్ల రికార్డు బ్రేక్ చేసిన పసికూన సారథి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

