Benjamin Kiplagat | కెన్యాలో మారథాన్ రన్నర్ దారుణ హత్య.. మెడ, ఛాతిపై కత్తిపోట్లు
Benjamin Kiplagat : ఉగాండాకు చెందిన ఒలింపియన్ బెంజమిన్ కిప్లగత్(Benjamin Kiplagat) దారుణంగా హత్యకు గురయ్యాడు. కెన్యా(kenya)లోని ఎల్డొరెట్ ప్రాంతంలో ఒక కారులో అతడి మృతదేహం దొరికింది. 34 ఏండ్ల బెంజమిన్ ఛాతి, మెడపై కత్తిపోట్లు....
Benjamin Kiplagat : ఉగాండాకు చెందిన ఒలింపియన్ బెంజమిన్ కిప్లగత్(Benjamin Kiplagat) దారుణంగా హత్యకు గురయ్యాడు. కెన్యా(kenya)లోని ఎల్డొరెట్ ప్రాంతంలో ఒక కారులో అతడి మృతదేహం దొరికింది. 34 ఏండ్ల బెంజమిన్ ఛాతి, మెడపై కత్తిపోట్లు ఉన్నాయి. దాంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు బెంజమిన్‌ను కిరాతకంగా చంపిన దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
‘బెంజమిన్ మెడపై లోతైన కత్తిపోట్లు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు. హంతకులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి’ అని స్థానిక పోలీస్ కమాండర్ స్టీఫెన్ ఒకల్ మీడియాకు తెలిపారు. ఉగాండా తరఫున బెంజమిన్ మూడుసార్లు ఒలింపిక్స్(Olympics) పోటీల్లో పాల్గొన్నాడు. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో పోటీ పడ్డాడు.
బెంజమిన్ కిప్లగత్

తమ గ్రామానికే చెందిన బొనిఫేస్ కిప్రోప్(Bonisef Kiprop)ను స్ఫూర్తిగా తీసుకున్నబెంజమిన్ అథ్లెట్‌గా మారాడు. బొనిఫేస్ 2004లో వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్(World Junior Championships)లో విజేతగా నిలిచాక అతడు కూడా దేశం తరఫున అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించాలని అనుకున్నాడు. మొదట్లో 10 వేల మీటర్ల పరుగుపై బెంజమిన్ దృష్టి సారించాడు.
అయితే.. కోచ్ అతడిని 1,500, 5 వేల మీటర్ల పరుగు వైపు మళ్లించాడు. 2006లో తొలిసారి వరల్డ్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్స్‌లో పోటీ పడి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అనంతరం వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో బెంజమిన్ 8ః35.77 నిమిషాల టైమింగ్‌తో జాతీయ రికార్డు బద్ధలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి
- Muhammad Waseem | ఒకే ఏడాది 100 సిక్సర్లు.. స్టార్ క్రికెటర్ల రికార్డు బ్రేక్ చేసిన పసికూన సారథి
- Tirumala | కొత్త ఏడాదిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
- XPoSAT | ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో అరుదైన ఘనత
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

