Muhammad Waseem | ఒకే ఏడాది 100 సిక్సర్లు.. స్టార్ క్రికెటర్ల రికార్డు బ్రేక్ చేసిన పసికూన సారథి
Muhammad Waseem : ప్రపంచ క్రికెట్లో పసికూన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్(UAE) జట్టు కెప్టెన్ ముహమ్మద్ వసీం(Muhammad Waseem) అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఏడాదిలో 100 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా వసీం చరిత్ర సృష్టించాడు. విండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle), భారత కెప్టెన్...
Muhammad Waseem : ప్రపంచ క్రికెట్లో పసికూన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్(UAE) జట్టు కెప్టెన్ ముహమ్మద్ వసీం(Muhammad Waseem) అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఏడాది 100 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా వసీం చరిత్ర సృష్టించాడు. విండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle), భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మ్యాక్స్‌వెల్(Glenn Maxwell), డేవిడ్ మిల్లర్(David Miller) వంటి పవర్ హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఆదివారం అఫ్గనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో మూడుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపిన వసీం 2023లో 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 47 మ్యాచుల్లోనే అతడు ఈ మైలురాయికి చేరడం విశేషం. తద్వారా రోహిత్ శర్మను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. హిట్‌మ్యాన్ 35 మ్యాచుల్లో 80 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
వసీం, రోహిత్ శర్మ, క్రిస్ గేల్

ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ ముందువరుసలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకూ మూడు సార్లు టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. హిట్‌మ్యాన్ 2019లో 78, 2018లో 74, 2017లో 65 సిక్సర్లు బాదాడు. ఇక టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) 2022లో 74 సిక్సర్లతో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇక 2012లో విండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ 52 సిక్సర్లతో ప్రకంపనలు సృష్టించాడు. ఆ తర్వాత రోహిత్ అతడి వారసుడిగా అంతర్జాతీయ వేదికపై సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- XPoSAT | ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రో అరుదైన ఘనత
- Varsha | లెహంగా వోణీలో కిర్రాక్ పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష..
- David Warner | వన్డేలకూ వార్నర్ గుడ్ బై.. షాక్‌లో అభిమానులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

