Rafael Nadal | వింబుల్డన్‌కు నాదల్ దూరం.. కారణమిదే..?
Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) కెరీర్లో కష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగిన రఫా.. వింబుల్డన్(Wimbledon)లోనూ ఆడడం అనుమానమే అనిపిస్తోంది.
Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) కెరీర్లో కష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. గాయం నుంచి కోలుకుని ఫ్రెంచ్ ఓపెన్(French Open) బరిలో నిలిచిన రఫా.. జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexander Zverev) ధాటికి నిలవలేక మూడు సెట్లు కోల్పోయాడు. కెరీర్లో ఆఖరి ఫ్రెంచ్ ఓపెన్ ఆడేశానన్న బాధను తట్టుకోలేక కన్నీళ్లను దిగమింగుతూ కోర్టును వీడాడు. అయితే.. నాదల్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్లోనూ ఆడడంపై సందేహం నెలకొంది.
”ప్రస్తుత పరిస్థితుల్లో మట్టి కోర్టు నుంచి గ్రాస్ కోర్టు మ్యాచ్‌లకు సిద్ధపడడం కష్టమైన పని. ఆ తర్వాత మట్టి కోర్టుపై ఒలింపిక్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. అందుకని వింబుల్డన్ ఆడతానని ఇప్పుడే చెప్పలేన’ని నాదల్ మ్యాచ్ అనంతరం అన్నాడు. దాంతో, ఈసారి వింబుల్డన్ టోర్నీ కళ తప్పనుందని అభిమానులు అనుకుంటున్నారు.

గతంలో ఎన్నోసార్లు గాయాలు వేధించినా.. గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చిన నాదల్ ఈసారి మునపటిలా ఆడలేకపోతున్నాడు. గత ఏడాది, ఈ ఏడాది ఆరంభంలో తొడ కండరాల గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన రఫా.. కఠోర శ్రమతో మళ్లీ రాకెట్ పట్టాడు. అది కూడా తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌తో పునరాగమనం ఘనంగా చాటలని భావించాడు. కానీ, ఈ దిగ్గజ ఆటగాడి అశలకు జర్మనీ కుర్రాడు జ్వెరెవ్ చెక్ పెట్టాడు. అంతే.. టీనేజర్‌గా ట్రోఫీ గెలిచిన చోట ఓటమితో తొలి రౌండ్లోనే నాదల్ నిష్క్రమించాడు.
ఇవి కూడా చదవండి
- Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ అరెస్టు
- Telangana | ఇంట్లో చొరబడ్డ కుక్క.. డయల్ 100కు కాల్ చేసి హెల్ప్ అడిగిన వ్యక్తి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

