బ్రిస్బేన్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గతేడాది చాలా టోర్నీలకు దూరమైన నాదల్ వచ్చి రావడంతోనే సత్తాచాటాడు.
బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో నాదల్ 7-5, 6-1తో ప్రపంచ మూడో ర్యాంక్ ప్లేయర్ డొనిమిక్ థీమ్పై అద్భుత విజయం సాధించాడు. మ్యాచ్ తొలి సెట్లో ఆరు అనవసర తప్పిదాలు మినహాయిస్తే..37 ఏండ్ల నాదల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.