Quinton de Kock | డివిలియర్స్ రికార్డుపై గురి పెట్టిన డికాక్.. మరో 23 పరుగులు చేశాడంటే..?
Quinton de Kock : దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) ప్రపంచ కప్(ODI World Cup 2023) తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నో కళాత్మక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ విధ్వంసక ఓపెనర్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) రికార్డుపై గురి పెట్టాడు. మరో 23 పరుగులు కొడితే అతను..
Quinton de Kock : దక్షిణాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) ప్రపంచ కప్(ODI World Cup 2023) తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నో కళాత్మక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ విధ్వంసక ఓపెనర్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) రికార్డుపై గురి పెట్టాడు. మరో 23 పరుగులు కొడితే అతను 6 వేల పరుగుల క్లబ్లో చేరతాడు. అవును.. డివిలియర్స్ మాత్రం 147 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి దాటాడు. డికాక్ 23 రన్స్ చేస్తే దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 6వేల రన్స్ చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో హషీం ఆమ్లా(Hashim Amla) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆమ్లా 123 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
డికాక్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే.. తొలి వన్డేలో 14 పరుగులకే ఔటయ్యాడు. మిగతా రెండు వన్డేల్లో అతను రాణిస్తే 6వేల క్లబ్లో చేరతాడు. వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికకు ముందుగానే డికాక్ రిటైర్మెంట్ నిర్ణయాన్నివిషయాన్ని సెలెక్టర్లకు తెలియజేశాడు. వాళ్లు కూడా డికాక్ నిర్ణయానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.
క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్

నాలుగో క్రికెటర్‌గా రికార్డు
డికాక్ 2013లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన డికాక్ విధ్వంసక ఓపెనర్‌గా సఫారీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు ఈ లెఫ్ట్ హ్యాండర్ 21 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యు పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. దాంతో, తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1,000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోర్ .. 178.స్వదేశంలో ఇప్పటివరకూ 140 వన్డేలు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 44.85 సగటుతో 5,966 రన్స్ కొట్టాడు. అందులో 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు దక్షిణాఫ్రికా బెస్ట్ వికెట్ కీపర్లలో ఒకడైన డికాక్ 183 క్యాచ్‌లు, 14 స్టంపింగ్స్‌తో 197 మంది బ్యాటర్లను పెవిలియన్ పంపాడు.
ఇవి కూడా చదవండి
Shoaib Akhtar | ఆ మ్యాచ్‌ను మహాభారతంలా చిత్రీకరిస్తున్నారు.. దాయాదుల పోరుపై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Harbhajan Singh | భారత బృందంలో ఈ ఇద్దరూ మిస్.. నేను సెలెక్టర్‌గా ఉంటే అతడికి చోటు దక్కేది : భజ్జీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

