MI vs PBKS : లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌ను ముంబై ఇండియన్స్ ఢీ కొడుతోంది. వరస ఓటములతో అడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిన ముంబై వాంఖడేలో పంజాబ్‌కు చెక్ పెట్టాలనుకుంటోంది. అయితే.. హార్దిక్ పాండ్యా టాస్ ఓడిపోయాడు.
తొలుత బ్యాటింగ్ చేయనున్న ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో క్వింటన్ డికాక్‌ను తీసుకుంది. నిరుడు రెండు మ్యాచుల్లో ముంబైని ఓడించిన పంజాబ్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటోంది. విధ్వంసక హిట్టర్ డికాక్ ముంబై తుది జట్టులోకి రాగా.. మయాంక్ రావత్ అరంగేట్రం చేయనున్నాడు.
🚨Toss update from Mumbai 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @mipaltan
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#TATAIPL | #KhelBindaas | #MIvPBKS pic.twitter.com/8JUs4Tk9hj
— IndianPremierLeague (@IPL) April 16, 2026
ముంబై తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రియాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, నమన్ ధిర్, మయాంక్ రావత్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ – గజన్ఫర్, కార్బిన్ బాస్చ్, రజ్ బవా, రాబిన్ మింజ్, అశ్వనీ కుమార్.
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), కూపర్ కొన్నొల్లీ, శశాంక్ సింగ్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, బార్ట్లెట్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్‌ప్రీత్ బ్రార్, సుయాన్ష్ శెడ్గే, యశ్ ఠాకూర్.