హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కీలక నిర్ణయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి ఆరుగురు సభ్యులను హెచ్సీఏలో నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది.
దీనిలో భాగంగానే పలు కొత్త జిల్లాలకు సంఘంలో సభ్యత్వం కల్పించారు. జిల్లా కోటాలో వాల శరత్ చంద్ర(మంచిర్యాల), మఠం భిక్షపతి(సంగారెడ్డి), బుద్దుల శ్రవన్ రెడ్డి(వికారాబాద్), దాదన్నగారి సందీప్ కుమార్(కామారెడ్డి), దావ సురేష్(జగిత్యాల), కల్కుంట్ల మల్లికార్జున్(సిద్దిపేట)లను హెచ్సీఏ ఏజీఎంలో సభ్యులుగా చేరుస్తున్నట్లు అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు.
వీరిని పలు జిల్లాల అడ్హక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నూతన అడ్హక్ కార్యదర్శులు, సొసైటీస్ చట్టం ప్రకారం సంబంధిత జిల్లా క్రికెట్ అసోసియేషన్లను, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించనున్నారని అసోసియేషన్ ప్రకటించింది. తద్వారా మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు అజారుద్దీన్ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

