Football – Racism : ఫుట్‌బాల్ మైదానంలో మరోసారి రేసిజం(Racism) కలకలం మొదలైంది. తాజాగా రియల్ మాడ్రిడ్ ఆటగాడు, నల్లజాతీయుడైన వినిసియస్ జూనియర్(Vinícius Jr)పై కొందరు జాతివివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. వలెన్సియాతో మ్యాచ్ జరుగుతుండగా అతడిని టార్గెట్ చేసిన కొందరు ఫ్యాన్స్ మొ*నో.. మొ*నో అంటూ అరిచారు. స్పానిష్ భాషలో మొ*నో అంటే ‘మంకీ’ అని అర్థం. వినిసియస్ను వాళ్లు ‘మంకీ.. మంకీ’ అని హేళన చేశారు.
దాంతో, ఈ సంఘటనను స్పెయిన్‌కు చెందిన లా లిగా ఫుట్‌బాల్ క్లబ్ తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. ‘నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి సంఘటనను నేను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు’ అని రియల్ మాడ్రిడ్ మేనేజర్ కార్లో అన్సెలొట్టి తెలిపాడు.
రేసిజానికి గురైన వినిసియస్ జూనియర్‌కు ఫుట్‌బాల్ ఆటగాళ్లు మద్దతు తెలుపుతున్నారు. స్టార్ ప్లేయర్ కైలీ ఎంబాపే(Kylian Mbappé) ‘నువ్వు ఒంటరివి కాదు. మేమంతా నీతో ఉన్నాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ల లిగా క్లబ్ ఫ్యాన్స్‌పై వినిసియస్ పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘లా లిగా ఒకప్పుడు రొనాల్డో, మెస్సీ వంటి ఆటగాళ్లకు ప్రసిద్ధి. కానీ, ఇప్పుడు రేసిజానికి కేంద్రంగా ఉంది’ అని రాసుకొచ్చాడు.