సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 23, 2020 , 00:41:37

మెరిసిన పృథ్వీ షా

 మెరిసిన పృథ్వీ షా

న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో కివీస్‌ ‘ఎ’పై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేసింది.

కివీస్‌ ‘ఎ’పై భారత్‌ ‘ఎ’ విజయం 

లింక్లోన్‌(న్యూజిలాండ్‌): న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ ‘ఎ’ జట్టు హవా కొనసాగుతున్నది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన  మనోళ్లు..తొలి అనధికారిక వన్డేలోనూ విజృంభించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో కివీస్‌ ‘ఎ’పై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేసింది. కివీస్‌ ‘ఎ’ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని 29.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. తన సూపర్‌ ఫామ్‌ను చాటుతూ ఓపెనర్‌ పృథ్వీ షా (48) మరోమారు బ్యాటు ఝులిపించా డు. తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు భారీ సిక్స్‌లతో చెలరేగాడు. మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌ (39), సూర్యకుమార్‌ యాదవ్‌(35), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(30) ఆకట్టుకున్నారు. అంతకుముందు మహమ్మద్‌ సిరాజ్‌(3/33), ఖలీల్‌ అహ్మద్‌(2/46), అక్షర్‌పటేల్‌(2/31)ధాటికి కివీస్‌ ‘ఎ’ 48.3 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.logo