Prithvi Shaw | ముంబై రంజీ జట్టులో విధ్వంసక ఓపెనర్.. ఇక బౌలర్లకు చుక్కలే
Prithvi Shaw : ముంబై విధ్వంసక ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) పునరగామనం చేయనున్నాడు. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న షా రంజీ స్క్వాడ్(Ranji Squad)లో చోటు దక్కించుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) నుంచి..
Prithvi Shaw : ముంబై విధ్వంసక ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) పునరగామనం చేయనున్నాడు. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న షా రంజీ స్క్వాడ్(Ranji Squad)లో చోటు దక్కించుకున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) అతడిని రంజీ జట్టుకి సెలెక్ట్ చేసింది.
ఈ డాషింగ్ బ్యాటర్ అజింక్యా రహానే(Ajinkya Rahane) నేతృత్వంలోని ముంబై జట్టుతో కలువనున్నాడు. ఫిబ్రవరి 2వ తేదీన బెంగాల్(Bengal)తో జరిగే మ్యాచ్‌లో షా బరిలోకి దిగే చాన్స్ ఉంది. గత రంజీ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన షా ముంబైకి శుభారంభాలు ఇచ్చేందుకు తహతహలాడుతున్నాడు.
ముంబై స్క్వాడ్ : అజింక్యా రహానే(కెప్టెన్), శివం దూబే, పృథ్వీ షా, జయ్ బిస్తా, భూపేన్ లల్వానీ, అమోగ్ భక్తల్, సువేద్ పర్కార్, ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), హార్తిక్ తమోర్(వికెట్ కీపర్), సుయాన్ష్ షెడ్గే, తనుష్ కొటియన్, అథర్వ అంకొలేకర్, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్తి, ధవల్ కులకర్ణి, రోయ్స్టన్ డైస్, సిల్వెస్టర్ డిసౌజా.
పృథ్వీ షా ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో దారుణంగా విఫలమయ్యాడు. అయినా సరే ఢిల్లీ షాను 17వ సీజన్ కోసం అట్టిపెట్టుకుంది. 2023 ఎడిషన్‌లో తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టును నట్టేట ముంచాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 8 మ్యాచుల్లో ఒక హాఫ్ సెంచరీతో కలిపి 106 పరుగులు చేశాడంతే. అతడితో పాటు మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ భారీ స్కోర్లు చేయకపోవడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బతిన్నాయి.

ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు పృథ్వీని పక్కన పెట్టారు. మళ్లీ భారత జట్టులోకి రావాలంటే పరుగులు సాధించడం ఒక్కటే మార్గమని అనుకున్న షా.. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్‌తో చితక్కొట్టాడు.

సొమర్సెట్ (Somerset) జట్టుపై డబుల్ సెంచరీ (244), డుర్హం జట్టు(Durham)పై సెంచరీ(125 నాటౌట్)తో చెలరేగాడు. అయితే.. మోకాలి గాయంతో టోర్నీ మధ్యలోనే షా స్వదేశానికి వచ్చేశడు. ఇరానీ కప్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు దూరమైన ఈ స్టార్ బ్యాటర్ రంజీల్లో తడాఖా చూపేందుకు ఎదురుచూస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
- Virat Kohli | ఆ రేసింగ్ సిరీస్ కోసమే టెస్టులకు దూరం.. కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
- Stocks | బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

