Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 9: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత వినే ఉంటాం. ఈ నానుడికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది హనుమకొండ రెడ్డి కాలనీలోని ప్రోగ్రెస్ హైస్కూల్ మూడో తరగతి చదవుతున్న బోయిని యషిక.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 9: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత వినే ఉంటాం. ఈ నానుడికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది హనుమకొండ రెడ్డి కాలనీలోని ప్రోగ్రెస్ హైస్కూల్ మూడో తరగతి చదవుతున్న బోయిని యషిక. ఈ చిన్నారి తన అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్-2026’ సాధించింది. చిన్ని వయసులోనే ఈ ఘనత సొంతం చేసుకున్న యషికను పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ మల్లాడి ప్రభాకర్ రెడ్డి అభినందించారు.
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సత్కార కార్యక్రమంలో బోయిని యషికను పలువరు ప్రశంసించారు. ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జి, హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నేరెళ్ల వెంకట హైమ పూజిత చిన్నారి యషిక సాధించిన అసాధారణ విజయాన్ని అభినందించారు. అనంతరం సమాజంలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం ప్రాముఖ్యాన్ని ఆమె వివరించారు.
గౌరవ అతిథులుగా విచ్చేసిన కేయూ ఈసీ మెంబర్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యూనల్ కోర్టు మెంబర్ డాక్టర్ కె.అనితారెడ్డి డాక్టర్ హుస్సేన్ విద్యార్థిని యషికను, పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. మానవ శరీరంలోని 9 ప్రధాన వ్యవస్థలకు సంబంధించిన 110 భాగాలను కేవలం ఒక్క నిమిషంలోనే అద్భుతంగా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది యషిక. హైస్కూల్ ప్రిన్సిపాల్ మల్లాడి ప్రభాకర్‌రెడ్డి, అతిథులు ప్రతిభాశాలి అయిన యషికను, ఆమె తల్లిదండ్రులు బోయిని రాజు రెడ్డి, రజిని రెడ్డి దంపతులను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

