Premier League | యువ ఫుట్‌బాలర్ బైసికిల్ గోల్.. వీడియో వైరల్
Premier League : ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రీమియర్ లీగ్(Premier League)లో మాంచెస్టర్ యునైటెడ్ యువ ఫుట్‌బాలర్ కండ్లు చెదిరే గోల్ కొట్టాడు. 19 ఏండ్ల వింగర్ అలెజాండ్రో గర్నాచో(Winger Alejandro Garnacho) గాల్లోకి ఎగిరి బైసికిల్ గోల్(Bicycle Goal) చేశాడు. అతడి విన్యాసాన్ని చూసి స్టేడియం...
Premier League : ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రీమియర్ లీగ్(Premier League)లో మాంచెస్టర్ యునైటెడ్ యువ ఫుట్‌బాలర్ కండ్లు చెదిరే గోల్ కొట్టాడు. 19 ఏండ్ల వింగర్ అలెజాండ్రో గర్నాచో(Winger Alejandro Garnacho) గాల్లోకి ఎగిరి బైసికిల్ గోల్(Bicycle Goal) చేశాడు. అతడి విన్యాసాన్ని చూసి స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అనంతరం వింగర్ ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డో తరహాలో ‘సియూ'(Siu) సెలబ్రేషన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
వింగర్ బైసికిల్ గోల్ వీడియో
ఆదివారం ఎవర్టన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వింగర్ మెరికలా కదిలాడు. ఆట మొదలైన మూడో నిమిషంలోనే ఈ యంగ్‌స్టర్ 15 అడుగుల వలయం నుంచి బైసికిల్ గోల్ చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరిన వింగర్ బంతిని తల మీదుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఎవర్టన్ గోల్‌కీపర్ ఆ బంతిని ఎలా అడ్డుకోవాలో తెలియక చూస్తుండిపోయాడు. ఫుట్‌బాల్‌లో కష్టసాధ్యమైన ఆ గోల్ చేయడాన్ని తాను నమ్మలేకపోయానని వింగర్ మ్యాచ్ అనంతరం అన్నాడు. బైసికిల్ గోల్‌తో వింగర్ 12 ఏండ్ల క్రితం ఇంగ్లండ్ లెజెండ్ వేన్ రూనీ(Wayne Mark Rooney)ని గుర్తు చేశాడు. రూనీ అద్భుత గోల్ చేయడంతో 2011లో మాంచెస్టర్ సిటీపై ఓల్ట్ ట్రఫోర్డ్ 2-1తో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి
-
Shreyas Iyer | ఫార్ములా వన్ దిగ్గజంతో అయ్యర్.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే..?
-
Election Commission | ‘రైతుబంధు’ అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ
-
Rain Update | రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం.. మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం.. హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
Raptadu | పోలీసుల కాల్పుల్లో రాప్తాడు నిందితుడు హేమంత్ కాళ్లు ఛిద్రం.. రెండు కాళ్లు తొలగించాల్సిందేనా?
KCR | కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం.. ఎర్రబెల్లితో గోడు వెళ్లబోసుకున్న రైతు లచ్చయ్య!
Ambuja Sanghi Samrat City | చెరో విల్లా.. చెరువు గుల్ల.. కోహెడలో ‘అంబుజా సంఘీ సామ్రాట్ సిటీ’ పేరిట అరాచకం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

