బెంగళూరు: గ్లోబల్ చెస్ లీగ్ నాలుగో సీజన్లో భారత గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీబీజీ అలస్కాన్ నైట్స్ తొలి విజయం అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 11-6తో ముంబై మాస్టర్స్‌పై గెలిచింది. అర్జున్, నినో బాట్సియాష్విలి, అభిమన్యు మిశ్రా తెల్లపావులతో విజయం సాధించి జట్టును గెలిపించారు.
మరో మ్యాచ్.లో గ్యాంజేస్ గ్రాండ్‌మాస్టర్స్ 9-7తో టేబుల్ టాపర్ అమెరికన్ గ్యాంబిట్స్ను ఓడించింది. మరో పోరులో డిఫెండింగ్ చాంప్ అల్పైన్ పైపర్స్.. గ్యాంజేస్పై గెలిచి వరుసగా రెండో విజయం అందుకుంది. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, విదిత్ గుజరాతి తమ గేమ్స్‌లో గెలిచారు.