Pat Cummins | ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర.. కమిన్స్‌ను 20.5 కోట్లకు కొన్న హైదరాబాద్
Pat Cummins : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం(IPL2024 Mini Auction)లో ప్యాట్ కమిన్స్(Pat Cummins) రికార్డు ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్నఈ స్టార్ పేసర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(LSG), హైదరాబాద్ ఫ్రాంచైజీ(SRH)లు పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్...
Pat Cummins : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం(IPL2024 Mini Auction)లో ప్యాట్ కమిన్స్(Pat Cummins) రికార్డు ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్నఈ స్టార్ పేసర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(LSG), హైదరాబాద్ ఫ్రాంచైజీ(SRH)లు పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్ రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు ఈ ఏడాది రెండు ఐసీఈసీ ట్రోఫీలు అందించిన వ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తద్వారా సామ్ కరన్ రూ.18.25 కోట్ల రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.
దుబాయ్ గడ్డపై కొకాకోలా ఎరేనా హోటల్లో జరుగుతున్న వేలాన్ని ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) నిర్వహిస్తోంది. ఆక్షన్‌లో తొలి రౌండ్లో విండీస్ టీ20 సారథి రోవ్‌మన్ పావెల్(Rovman Powell) అత్యధికంగా రూ. 7.40 కోట్లు పలికాడు. రూ. కోటికి రిజిష్టర్ అయిన ఈ విధ్వంసక బ్యాటర్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
PAT your backs, Hyd. We’re HEADing towards glory 🧡#HereWeGOrange pic.twitter.com/0nOwwkcyg2
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్(Travis Head) రెండో స్థానంలో నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న ఈ స్టార్ ఓపెనర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ చిచ్చరపిడుగు హ్యారీ బ్రూక్ రూ. 4 కోట్లు పలికాడు. ఈ స్టార్ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. నిరుడు వేలంలో రూ. 13.25 కోట్లు పలికిన బ్రూక్.. ఈసారి తక్కువ ధరకే అమ్ముడుపోవడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

