Parul Chaudhary | ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పారుల్.. 5 కి.మీ పరుగు పందెంలో గోల్డ్ మెడల్
Parul Chaudhary | చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి చరిత్ర సృష్టించింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల పరుగు పందెంలో అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది.
Parul Chaudhary | చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి చరిత్ర సృష్టించింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల పరుగును కేవలం 15 నిమిషాల 14.75 సెకన్లలో పూర్తిచేయడం ద్వారా అగ్ర స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది.
దాంతో ఆసియాడ్‌లో ఐదు కిలోమీటర్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా 28 ఏళ్ల పారుల్ రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్‌కు చెందిన హిరోనికా రిరికా 15 నిమిషాల 15.34 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. కజకిస్థాన్ అథ్లెట్ కిప్కిరుయ్ కరోలిన్ చెప్‌కోయిచ్ 15 నిమిషాల 23.12 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసి మూడో స్థానంలో నిలువడం ద్వారా కాంస్యం నెగ్గింది.
కాగా, పారుల్ చౌదరికి ఈ ఆసియాడ్‌లో ఇది రెండో పతకం. సోమవారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో కూడా పారుల్ చౌదరి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. ఇవాళ ఐదు కిలోమీటర్ల పరుగులో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పారుల్ నెగ్గిన పసిడితో కలిసి ఈ ఆసియా క్రీడల్లో భారత్ గెలిచిన గోల్డ్ మెడల్స సంఖ్య 14కు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 60 దాటింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

