Paralympics | భారత్‌కు ఐదో స్వర్ణం..
Paralympics | టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే.
Captured #GOLD Moment 😍#Tokyo2020 men’s singles SH6 #Gold medalist Krishan Nagar 🇮🇳 pic.twitter.com/Zob52vbTJQ
— Doordarshan Sports (@ddsportschannel) September 5, 2021
పారాలింపిక్స్‌లో భారత్‌కు నేడు రెండు పతకాలు లభించాయి. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. బ్యాడ్మింటన్ పురుషుల ఎస్ఎల్ 4 విభాగంలో ప్రపంచ నంబర్ వన్, ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్‌తో జరిగిన ఫైనల్లో 2-1 తేడాతో ఓడిపోయాడు.
కృష్ణ నాగర్ సాధించిన గోల్డ్ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, ఐదు బంగారు పతకాల్లో రెండు బ్యాడ్మింటన్ నుంచే ఉండటం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

