Rishabh Pant | పంత్‌కు ప్రమోషన్.. మిడిలార్డర్ బ్యాటర్‌గా విధ్వంసక హిట్టర్..!
Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant ) బ్యాటింగ్ ఆర్డర్ మారనుంది. పపర్ ప్లేలో వికెట్ పడితే.. వేగంగా పరుగులు రాబట్టే బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించింది లక్నో యాజమాన్యం.
Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant ) బ్యాటింగ్ ఆర్డర్ మారనుంది. నాలుగు, ఐదో స్థానాల్లో ఆడిన పంత్ ఈ ఎడిషన్‌లో మూడో స్థానంలో క్రీజులోకి రానున్నాడు. పపర్ ప్లేలో వికెట్ పడితే.. వేగంగా పరుగులు రాబట్టే బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించింది లక్నో యాజమాన్యం. నిరుడు నికోలస్ పూరన్ (Nicholas Pooran) మూడులో ఆడగా.. ఈసారి పంత్ చెలరేగిపోనున్నాడు.
పంతొమ్మిదో సీజన్లో కొత్త జెర్సీ, కొత్త లోగోతో లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగుతోంది. ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే కసితో ఉన్న లక్నో జట్టు అయోధ్య రాముడిని దర్శించుకుంది కూడా. మెగా టోర్నీకి ఆరు రోజులు ఉన్నందున అన్ని విభాగాలను సరి చూసుకుంటున్న రిషభ్ పంత్ సేన బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయాలనుకుంటోంది. గత సీజన్లో మూడో స్థానంలో ఆడిన నికోలస్ పూరన్‌ను మిడిలార్డర్లో ఆడించి.. సారథికి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటోంది.
Bahane bohot ho gaye… ab Ekana mein milte hai 🤝❤️💙
Book your tickets now! 👇https://t.co/idh8J08T09 pic.twitter.com/30UrH7l6m7
— Lucknow Super Giants (@LucknowIPL) March 19, 2026
మెగా వేలంలో రికార్డు ధర(రూ.27 కోట్లు) పలికిన పంత్‌ను జట్టు అవసరం రీత్యా మూడో స్థానంలో ఆడించాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. ‘దూకుడుగా ఆడే పంత్ మూడో స్థానానికి పక్కగా సరిపోతాడని మేనేజ్మెంట్ సహా అతడు భావిస్తున్నాడు. అందుకని ఈ సీజన్లో టాపార్డర్‌లో ఎడెన్ మర్క్రమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ ఆడుతారు. మిడిలార్డర్లో మాత్రం ఈ షరతులేమీ లేవు. ఆ రోజు ఆటను బట్టి ఎవరిని ముందు పంపాలి? అనేది అప్పటికప్పుడు నిర్ణయిస్తాం’ అని లక్నో వర్గాలు పీటీఐతో తెలిపాయి.
🚨 BIG UPDATE ON RISHABH PANT 🚨 [ Bharat Sharma PTI ]
“ Rishabh Pant is set to be bat at number 3 in IPL 2026 where he scored hundred in the last season ”
Rishabh 🤝 Sanju
Who will be become India’s first choice wicket keeper after IPL 2026 ??— Indian Cricket Netwrk (@ICN_Updates01) March 22, 2026
గత సీజన్లో పంత్‌పై భారీ ఆశలు పెట్టుకున్న లక్నోకు తీవ్ర నిరాశే మిగిలింది. 13 మ్యాచుల్లో మోస్తరుగా ఆడిన అతడు ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీపై సెంచరీ(118 నాటౌట్)తో 269 పరుగులు సాధించాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

