చెన్నై: సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్‌కప్(cricket worldcup) మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 9 రన్స్ చేసి ఔటయ్యాడు. పాక్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 రన్స్ చేసింది. పాక్ జట్టులో రెండు మార్పులు చేశారు. మహమ్మద్ వాసిమ్, మహమ్మద్ నవాజ్‌లను జట్టులో చేరుకున్నారు. కసిగో రబడ, రీజా హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్‌ను దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ కోసం రెస్ట్ ఇచ్చింది.