ENG vs PAK | మొదటి టెస్టు ఇంగ్లండ్‌దే.. 74 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం
మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి ఇంగ్లండ్
ENG vs PAK : రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. రికార్డులు బద్దలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 74 పరుగులతో గెలిచింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డ్రాగా ముగుస్తుంది అనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు అద్బుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను గెలిపించారు. స్పిన్నర్ జాక్ లీచ్ నసీం షాను ఎల్బీగా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. పాక్ బ్యాటర్లలో సాద్ షకీల్ ఒక్కడే అర్థ సెంచరీ (74 రన్స్)తో రాణించాడు. రిజ్వాన్ 48 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ బెన్‌స్టోక్ ఒక వికెట్ తీశాడు. కీలక సమయంలో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను గెలిపించిన రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలే (122), బెన్ డకెట్(107) పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. మిడిలార్డర్లో ఓలి పోప్(108), హ్యారీ బ్రూక్ (153) కూడా వన్డే తరహాలో చెలరేగి ఆడి సెంచరీలు చేశారు. దాంతో ఇంగ్లండ్ 657 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాటింగ్‌కు అచ్చొచ్చిన పిచ్‌పై పాకిస్థాన్ బ్యాటర్లు కూడా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓపెనర్లు షఫిక్ (114), ఇమాముల్ హక్(121)తో పాటు కెప్టెన్ బాబర్ ఆజాం(136) శతకాలు సాధించారు. దాంతో, పాక్ 597 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 78 పరుగుల ఆధిక్యం లభించింది. దాంతో, మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బెన్‌స్టోక్ రెండో ఇన్నింగ్స్‌ను 264-7 వద్ద డిక్లేర్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ జాక్ క్రాలే అర్థసెంచరీ చేశాడు. జాక్ రూట్ (73 రన్స్), హ్యారీ బ్రూక్ (87) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. నసీం షా, మహహ్మద్ అలీ, జహద్ మొహమ్మద్ తలా రెండు వికెట్లు తీశారు.
గెలిపించిన బౌలర్లు
రెండో ఇన్నింగ్స్‌లో 342 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్ ఒకదశలో మ్యాచ్ గెలిచేలా కనిపించింది. మూడో సెషన్ అయ్యేసరికి పాక్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ప్రమాదకరంగా మారుతున్న అఘా సల్మాన్, అజర్ అలీ జోడీని రాబిన్సస్ విడదీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. అతను వరుస ఓవర్లలో ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే 87వ ఓవర్లో అండర్సన్ రెండు వికెట్లు తీయడంతో పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆశలు కోల్పోయింది.
.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

