PAKvsAUS: ఇమామ్‌పై వేటు..! సిడ్నీ టెస్టులో యువ ఓపెనర్‌కు ఛాన్స్ ఇస్తున్న పాకిస్తాన్
PAKvsAUS: తొలి రెండు టెస్టులలో ఇమామ్ ఉల్ హక్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు తన స్లో బ్యాటింగ్‌తో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా పరగులు మాత్రం రాబట్టలేకపోయాడు. దీంతో జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా మొదలుకాబోయే మూడో టెస్టులో ఆ జట్టు 21 ఏండ్ల యువ ఓపెనర్...
PAKvsAUS: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఆ జట్టును గాయాలు వేధిస్తే వరుసగా రెండు టెస్టు (పెర్త్, మెల్బోర్న్)లలో ఓటమితో ఆ జట్టు సిరీస్ కూడా కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో విఫలమై రెండో మ్యాచ్‌లో ఆ జట్టు మెరుగ్గానే ఆడినట్టు కనిపించినా నాలుగో ఇన్నింగ్స్‌లో తడబడి మరో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా మొదలుకాబోయే మూడో టెస్టులో ఆ జట్టు 21 ఏండ్ల యువ ఓపెనర్ సయీమ్ అయూబ్‌కు అవకాశమివ్వనుంది. సీనియర్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది.
తొలి రెండు టెస్టులలో ఇమామ్ ఉల్ హక్ దారుణంగా విఫలమయ్యాడు. అతడు తన స్లో బ్యాటింగ్‌తో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా పరగులు మాత్రం రాబట్టలేకపోయాడు. ఇమామ్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ టీమ్ మేనేజ్మెంట్.. ఇమామ్‌పై వేటు వేసి సయీమ్కు ఛాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం.
గతేడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సయీమ్ ఇప్పటివరకూ ఆడింది 14 మ్యాచ్‌లే. కరాచీలో పుట్టి పెరిగిన అతడు.. ఈ ఏడాది అతడు 8 టీ20లు ఆడాడు. అయితే అతడి బ్యాటింగ్‌లో దూకుడు, సాధికారతతో ఆడే సయీమ్ ఆటతీరు మెచ్చిన సెలక్టర్లు.. ఈ అన్క్యాప్డ్ ఓపెనర్‌కు సిడ్నీలో ఓపెనర్‌గా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. పాక్ దిగ్గజం సయీద్ అన్వర్ ఆటను పోలి ఉండే అయూబ్.. ఫ్యూచర్ స్టార్ అని ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
Saeed Anwar & Saim Ayub#BabarAzam𓃵 #PAKvsAUS #AUSvPAKpic.twitter.com/HquMI5Jq4z
— Noor (@noornffatima) December 24, 2023
మరోవైపు తొలి టెస్టుకు ముందే కాలిగాయంతో రెండు టెస్టులకు దూరమైన స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ కూడా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దీంతో ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. రెండు మ్యాచ్‌లు ముగిసిన సిరీస్‌లో చివరి టెస్టు అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని పాక్ భావిస్తోంది. ఆ జట్టు 1999 నుంచి ఇప్పటివరకూ ఆసీస్‌లో టెస్టు మ్యాచ్ గెలవలేదు. మెల్బోర్న్ టెస్టులో ఓటమి పాకిస్తాన్‌కు ఆసీస్‌కు వరుసగా 16వ టెస్టు ఓటమి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

